Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 15 to 19

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 15 to 19
Sloka 15-దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడినవారు, దానవప్రవృత్తియైన నాస్తికస్వభావమును కలిగియుండువారు నా శరణము నొందరు.
Sloka 16-ఓ భరతవంశశ్రేష్టుడా! ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్త్వజ్ఞానము నన్వేషించువాడు అనెడి నాలుగురకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్తసేవ నొనరింతురు.
Sloka 17-వీరిలో సంపూర్ణజ్ఞానము కలిగి సదా భక్తియుక్తసేవలో నియుక్తుడై యుండెడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయన నేనతనికి మిక్కిలి ప్రియుడను మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు.
Sloka 18-ఈ భక్తులందరును నిస్సంశయముగా ఉదాత్తులే యైనను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైనవానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమ మరియు పరమగతియైన నన్ను తప్పక పొందగలడు.
Sloka 19-జ్ఞానవంతుడైనవాడు బహు జన్మమృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలిసికొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు.
PURPORT:-
భక్తియుతసేవ నొనరించుచు జీవుడు పలుజన్మల పిదప శ్రీకృష్ణభగవానుడే ఆధ్యాత్మికానుభవపు చరమలక్ష్యమును దివ్యమగు శుద్ధజ్ఞానమునందు వాస్తవముగా స్థితుడు కాగలడు. ఆధ్యాత్మికానుకానుభవపు ఆది యందు మనుజుడు భౌతికత్వసంపర్కమును తొలగించుకొను యత్నము చేయునపుడు కొంత నిరాకారభావము వైపునకు మ్రొగ్గుచూపుట జరుగును. కాని అతడు తన యత్నములో పురోభివృద్ధి నొందినప్పుడు ఆధ్యాత్మిక జీవనమున పెక్కు కర్మలు గలవనియు, అవియే భక్తియుత సేవాకార్యములనియు అవగతము చేసికొనును. ఆ విధముగా అతడు తెలిసికొని శ్రీకృష్ణభగవానుని యెడ ఆకర్షితుడై అతనిని శరణుజొచ్చును. 
To be continued..

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.