Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 13 Sloka 15 to 20

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 13  Sloka 15 to 20
Sloka 15-ఇంద్రియ వస్తువిషయములను అన్నింటినీ ఆయన తెలుసుకొనగలిగినా, ఆయన ఇంద్రియ రహితుడు. ఆయనకు దేనిపట్ల కూడా మమకారానుబంధము లేదు, అయినా ఆయనే అన్నింటిని సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయినా, ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే.
Sloka 16-ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్షమైన వాడు, కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంలో ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు.
Sloka 17-ఆయన విభజించుటకు వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే, సమస్త భూతములకు (ప్రాణులకు) సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము.
Sloka 18-అన్ని తేజోమయవస్తువుల్లో ఆయనే ప్రకాశానికి మూలము, మరియు అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే, మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో ఉంటాడు.
Sloka 19-ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును, మరియు జ్ఞాన విషయమును, నేను తెలియచేసాను. నా భక్తులు మాత్రమే దీనిని యదార్థముగా అర్థం చేసుకోగలరు, అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు.
Sloka 20-ప్రకృతి (భౌతిక ప్రకృతి) మరియు పురుషుడు (ఆత్మలు) రెండూ కూడా అనాదియైనవి (సనాతనమైనవి). శరీరములోని అన్ని మార్పులూ మరియు ప్రకృతి త్రిగుణములూ కూడా, భౌతిక శక్తి చే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.