Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 26 to 30.

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 26 to 30.
Sloka 26-ఓ అర్జునా! దేవదేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగనున్న వానినన్నింటిని ఎరుగుదును. అలాగుననే జీవులందరిని నేను ఎరుగును కాని నన్నెవ్వరును ఎరుగరు.
Sloka 27-ఓ భరతవంశీయుడా! పరంతపా! కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులైన జీవులందరును మోహమునందే జన్మించుచున్నారు.
Sloka 28-పూర్వజన్మములందు, ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగ నశింపజేసికొనిన మనుజులు ద్వంద్వమోహముల నుండి విడివడినవారై నా సేవ యందు దృఢవ్రతముతో నెలకొనెదరు.
Sloka 29-ముసలితనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. దివ్యకర్మలను గూర్చి సమగ్రముగా నెరిగియుండుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై యున్నారు.
Sloka 30-నా యందు సంలగ్నమైన చిత్తము కలిగినవారు దేవదేవుడనైన నన్నే భౌతికజగత్తును, సర్వదేవతలను, సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలిసికొని మరణసమయమందును నన్ను (దేవదేవుడు) అవగాహనతో ఎరిగియుందురు. PURPORT:- కృష్ణభక్తిరసభావన యందు వర్తించు జనులు దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణముగా అవగాహనము చేసికొను మార్గము నుండి ఎన్నడును వైదొలగురు. శ్రీకృష్ణభగవానుడు ఈ విధముగా జగత్తును మరియు దేవతలను కూడా నడుపువాడై యున్నాడో కృష్ణభక్తిరసభావాన యొక్క దివ్యసాంగత్యము ద్వారా మనుజుడు తెలిసికొనగలడు. కృష్ణభక్తిభావనతో గల దివ్యసాహచర్యము ద్వారా క్రమముగా అతడు దేవదేవుని యందు విశ్వాసమును పొందును. అటువంటి కృష్ణభక్తిరసభావితుడు మరణసమయమున కూడా మరువబోడు. ఆ విధముగా సహజముగనే అతడు కృష్ణలోకమగు గోలోకబృందావనమును చేరగలడు. ఏ విధముగా మనుజుడు సంపూర్ణ కృష్ణభక్తిపరాయణుడు కాగలడో ఈ సప్తమాధ్యాయము ప్రత్యేకముగా వివరించినది. 
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.