Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 25

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 25
Sloka 25 మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడును వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగశక్తిచే కప్పబడియుందును. తత్కారణముగా వారు నేను  అజయ్యుడు ననియు, నాశములేనివాడననియు ఎరుగరు.
PURPORT:-
శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులకు దర్శనమొసగెను గావున ఇప్పుడు మాత్రము ఎందులకు సర్వులకు దర్శితమగుటలేదని ఎవరైనను వాదింపవచ్చును. కాని వాస్తవమునకు ఆ సమయమున కూడా శ్రీకృష్ణుడు సర్వులకు వ్యక్తము కాలేదు. భూమిపై అవతరించియున్నప్పుడు కొద్దిమంది మాత్రమే అతనిని దేవదేవునిగా తెలిసికొనగలిగిరి. కురుసభలో శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరముగా పలికినప్పుడు, భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతనిని దేవదేవునిగా తీర్మానించెను. అలాగుననే పాండవులు మరియు ఇతర కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవదేవుడని తెలిసికొనగలిగిరి. అతడెన్నడును అభక్తులకు మరియు సామాన్యజనులకు విదితము కాలేదు. కనుకనే భక్తులు తప్ప మిగిలిన వారందరు తనను తమవంటివాడనే తలంతురని శ్రీకృష్ణుడు గీత యందు పలికియుండెను. భక్తులకు ఆనందనిధిగా గోచరించు అతడు అజ్ఞానులైన ఆభక్తులకు తన అంతరంగశక్తిచే కప్పుబడియుండును. శ్రీకృష్ణభగవానుడు “యోగమాయ” అను తెరచే కప్పబడియున్నందున సామాన్యజనులు అతనిని తెలిసికొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలలో తెలియజేసెను. (శ్రీమద్భాగవతము 1.8.19). సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణభగవానుడు బ్రహ్మజ్యోతిచే కప్పబడియుండుట వలన బుద్ధిహీనులైన నిరాకారవాదులు అతనిని గాంచలేకున్నారు. To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.