Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 8 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 8 sloka 22 to 28
Sloka 22- సర్వులకన్నను అధికుడైన దేవదేవుడు అనన్యభక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపియై యున్నాడు మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగియున్నది.
Sloka 23-ఓ భరతవంశశ్రేష్టుడా! ఏయే కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగనునో లేక తిరిగిరాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను.
Sloka 24-పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మవిదులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతి యందు, పగటియందలి ఏదేని శుభఘడియ యందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు.
Sloka 25-ధూమమునందు, రాత్రియందు, కృష్ణపక్షమునందు, సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగివచ్చును.
Sloka 26-ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయము ననుసరించి శుక్ల, కృష్ణములనెడి రెండు మార్గములు కలవు. శుక్లమార్గమునందు మరణించువాడు తిరిగిరాకుండును. కాని చీకటిమార్గమున మరణించువాడు మాత్రము వెనుకకు తిరిగివచ్చును.
Sloka 27-ఓ అర్జునా! భక్తులు ఈ రెండు మార్గములు నెరిగినప్పటికిని ఎన్నడును మోహము నొందరు. కనుక నీవు భక్తియందు సదా స్థిరుడవగుము.
Sloka 28-వేదాధ్యయనము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్వికకర్మలను మరియు కామ్యకర్మలను ఒనరించుట వలన కలుగు ఫలితములు భక్తిమార్గము చేపట్టి మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుతసేవ నొనరించుట ద్వారా అతడు వీటినన్నింటిని పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.