Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 Sloka 21 to 25

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 Sloka 21 to 25
Sloka 21-దేవతా సమూహములన్నియును నిన్ను శరణువేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు ముగుల భయవిహ్వలులై దోసలియొగ్గి ప్రార్థనలను గావించుచున్నారు. మహర్షులు, సిద్ధసమూహములు “శాంతి, శాంతి” యని పలుకుచు వేదమంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.
Sloka 22-పరమశివుని పలుమారులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీకుమారులు, మరత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు.
Sloka 23-ఓ మహాబాహో! బహుముఖములును, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నియు వ్యథ చెందుచున్నవి. వానివలెనే నేనును కలతచెందుచున్నాను.
Sloka 24-ఓ సర్వవ్యాపక విష్ణూ! పలు ప్రకాశమాన వర్ణములతో ఆకాశమును తాకుచు, విప్పారిన వక్త్రములు, తేజోమయమైన నేత్రములు కలిగిన నిన్ను గాంచి నా మనస్సు భీతిచే కలతనొందినది. మనోస్థిరత్వమును గాని, సమత్వమును గాని నేను ఏ మాత్రము నిలుపుకొనలేకున్నాను.
Sloka 25-ఓ దేవదేవా! ప్రపంచశరణ్యా! దయచే నా యెడ ప్రసన్నుడవగుము. నీ మండుచున్న మృత్యువును బోలిన ముఖములను మరియు భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వవిధముల నేను భ్రాంతుడనైతిని.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.