Saturday 30 May 2020

కర్మ యోగ సంబంధ 45 పుస్తకాలు

*కర్మ యోగ సంబంధ 45 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా  45 పుస్తకాలు ఒకేచోట   https://www.freegurukul.org/blog/karmayogam-pdf
   (OR)
కర్మ సిద్ధాంతం https://www.freegurukul.org/z/KarmaYogam-1

కర్మ యోగం https://www.freegurukul.org/z/KarmaYogam-2

కర్మ యోగం https://www.freegurukul.org/z/KarmaYogam-3

కర్మయోగం https://www.freegurukul.org/z/KarmaYogam-4

కర్మయోగ విజ్ఞానము https://www.freegurukul.org/z/KarmaYogam-5

యోగ సమన్వయము-2-కర్మయోగం https://www.freegurukul.org/z/KarmaYogam-6

అనుదిన ధర్మాలు https://www.freegurukul.org/z/KarmaYogam-7

కర్మ సిద్దాంతం https://www.freegurukul.org/z/KarmaYogam-8

తత్వ దృష్టి-2-అనుష్టాన వేదాంతము https://www.freegurukul.org/z/KarmaYogam-9

గీతా రహస్యము అను కర్మయోగ శాస్త్రము-2 https://www.freegurukul.org/z/KarmaYogam-10

భారతీయ సంస్కారములు https://www.freegurukul.org/z/KarmaYogam-11

దినచర్య-1 https://www.freegurukul.org/z/KarmaYogam-12

నిత్యానుష్ఠానము https://www.freegurukul.org/z/KarmaYogam-13

నిత్య సాధన చంద్రిక https://www.freegurukul.org/z/KarmaYogam-14

నిత్యానుష్ఠాన చంద్రిక https://www.freegurukul.org/z/KarmaYogam-15

పునర్జర్మ విచారము https://www.freegurukul.org/z/KarmaYogam-16

సందేహాలు https://www.freegurukul.org/z/KarmaYogam-17

నిత్య పారాయణ సుత్తములు https://www.freegurukul.org/z/KarmaYogam-18

మంచితనమునకు మంచిఫలాలు https://www.freegurukul.org/z/KarmaYogam-19

జీవిత నావ https://www.freegurukul.org/z/KarmaYogam-20

జీవ కారుణ్యము https://www.freegurukul.org/z/KarmaYogam-21

కామము,ప్రేమ,పరివారము https://www.freegurukul.org/z/KarmaYogam-22

హిందూ లా https://www.freegurukul.org/z/KarmaYogam-23

అపర సిద్ధాంతము https://www.freegurukul.org/z/KarmaYogam-24

ఋగ్వేద సంధ్యా వందనం https://www.freegurukul.org/z/KarmaYogam-25

యజుర్వేద సంధ్యావందనం https://www.freegurukul.org/z/KarmaYogam-26

సంధ్యా వందనం - యజ్ఞోపవీత ధారణం https://www.freegurukul.org/z/KarmaYogam-27

సంధ్యాతత్త్వ సుభోధిని https://www.freegurukul.org/z/KarmaYogam-28

బ్రహ్మ చర్యం https://www.freegurukul.org/z/KarmaYogam-29

బ్రహ్మ చర్య విజ్ఞానము https://www.freegurukul.org/z/KarmaYogam-30

వివాహ తత్త్వము https://www.freegurukul.org/z/KarmaYogam-31

పెండ్లి సందడి- వివాహ పద్ధతి https://www.freegurukul.org/z/KarmaYogam-32

గృహస్థ ధర్మావళి https://www.freegurukul.org/z/KarmaYogam-33

గృహస్థాశ్రమం లో ఎలా వుండాలి https://www.freegurukul.org/z/KarmaYogam-34

స్నానము-భోజనము-తాంబూలము https://www.freegurukul.org/z/KarmaYogam-35

గృహస్థ ధర్మావళి https://www.freegurukul.org/z/KarmaYogam-36

పాణిగ్రహణం https://www.freegurukul.org/z/KarmaYogam-37

వీర శైవ పురోహిత https://www.freegurukul.org/z/KarmaYogam-38

యమలోక వార్తలు https://www.freegurukul.org/z/KarmaYogam-39

ప్రతి సాంవత్సరీక మహేశ్వరారాధన విధి https://www.freegurukul.org/z/KarmaYogam-40

జనుల-ఋషిగోత్ర-ప్రవరలు https://www.freegurukul.org/z/KarmaYogam-41

ఆర్ష ధర్మము https://www.freegurukul.org/z/KarmaYogam-42

కృష్ణ యజుర్వేద సంధ్యావందనం https://www.freegurukul.org/z/KarmaYogam-43

విశ్వకర్మ విశిష్టత https://www.freegurukul.org/z/KarmaYogam-44

సమగ్ర ఆబ్దిక ప్రయోగం https://www.freegurukul.org/z/KarmaYogam-45

కర్మ యోగం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul  and  iOS App: Gurukul Education
WhatsApp: 9042020123(To get this type of messages, SAVE this number and send START message)

Wednesday 27 May 2020

HISTORY OF SRI BHAGAVAD GITA

HISTORY OF SRI BHAGAVAD GITA 

History of Sri Bhagavad Gita and there is no Holy scripture is Greater than Sri Bhagavad Gita,  as it a direct Word of God VISHNU from his Avatar.
VEDAS like Rigveda , Yajur Veda, Atharva Veda and Samaveda are came out from mind of GOD VISHNU as a Four Rishis and later as per order of GOD VISHNU,  they are spreading KNOWLEDGE of science or spiritual in world in way of Holy Scriptures.

Tuesday 26 May 2020

Sri Bhagavad Gita in Telugu ---- భగవద్గీత సంబంద 69 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో

*భగవద్గీత సంబంద 69 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో*
------------------------------------------------
69 పుస్తకాలు ఒకేచోట   https://www.freegurukul.org/blog/bhagavadgita-pdf

               (OR)
 
భగవద్గీత సరళ తెలుగులో(వచన) https://www.freegurukul.org/z/BhagavadGita-1

భగవద్గీత  https://www.freegurukul.org/z/BhagavadGita-2

భగవద్గీత-భగవాన్ ఉవాచ https://www.freegurukul.org/z/BhagavadGita-3

భగవద్గీత https://www.freegurukul.org/z/BhagavadGita-4

యథార్ధ గీత https://www.freegurukul.org/z/BhagavadGita-5

వచనంలో బొమ్మల భగవద్గీత https://www.freegurukul.org/z/BhagavadGita-6

శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం-1,2 https://www.freegurukul.org/z/BhagavadGita-7

మలయాళ సద్గురు గ్రంధావళి-6-శ్రీ మద్భగవద్గీత https://www.freegurukul.org/z/BhagavadGita-8

గీతా సంహిత https://www.freegurukul.org/z/BhagavadGita-9

భగవద్గీత-అంతరార్ధ విశేషణాయత్నం https://www.freegurukul.org/z/BhagavadGita-10

గీతామృతం https://www.freegurukul.org/z/BhagavadGita-11

గీతా ప్రవచనములు https://www.freegurukul.org/z/BhagavadGita-12

జీవిత సాఫల్యానికి గీత చూపిన మార్గము https://www.freegurukul.org/z/BhagavadGita-13

గీతా సంగ్రహము https://www.freegurukul.org/z/BhagavadGita-14

గీతోపన్యాసములు https://www.freegurukul.org/z/BhagavadGita-15

గీతా ముచ్చట్లు https://www.freegurukul.org/z/BhagavadGita-16

గీతా భోధామృతము https://www.freegurukul.org/z/BhagavadGita-17

గీతా ప్రతిభ https://www.freegurukul.org/z/BhagavadGita-18

భగవద్గీతా పరిచయము https://www.freegurukul.org/z/BhagavadGita-19

భగవద్గీతా ప్రవేశము https://www.freegurukul.org/z/BhagavadGita-20

గీతా వ్యాసములు-2 https://www.freegurukul.org/z/BhagavadGita-21

గీతామృత సార సంగ్రహము https://www.freegurukul.org/z/BhagavadGita-22

స్థిత ప్రజ్ఞుడు - భక్తుడు https://www.freegurukul.org/z/BhagavadGita-23

గీతా వచనము https://www.freegurukul.org/z/BhagavadGita-24

భగవద్గీత -అర్జున విషాద,సాంఖ్య యోగం-వచన https://www.freegurukul.org/z/BhagavadGita-25

గీతారహస్యము https://www.freegurukul.org/z/BhagavadGita-26

గీతోపదేశతత్త్వము-1 https://www.freegurukul.org/z/BhagavadGita-27

శ్రీ కృష్ణుని గీతావాణి https://www.freegurukul.org/z/BhagavadGita-28

గీతామూలం https://www.freegurukul.org/z/BhagavadGita-29

భగవద్గీత భాష్యార్క ప్రకాశికానువాదము https://www.freegurukul.org/z/BhagavadGita-30

భగవద్గీతా మననము https://www.freegurukul.org/z/BhagavadGita-31

గీతా సామ్యవాద సిద్ధాంతం https://www.freegurukul.org/z/BhagavadGita-32

మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు https://www.freegurukul.org/z/BhagavadGita-33

నిత్య జీవితంలో భగవద్గీత https://www.freegurukul.org/z/BhagavadGita-34

గీతా హృదయము-జ్ఞానయోగం https://www.freegurukul.org/z/BhagavadGita-35

ప్రశ్నోత్తరీప్రవచన గీత https://www.freegurukul.org/z/BhagavadGita-36

గీతా శాస్త్రం https://www.freegurukul.org/z/BhagavadGita-37

గీతా తత్త్వవివేచనీ https://www.freegurukul.org/z/BhagavadGita-38

భగవద్గీత టీకా తాత్పర్య సహిత https://www.freegurukul.org/z/BhagavadGita-39

శ్రీగీతారాధన https://www.freegurukul.org/z/BhagavadGita-40

శ్రీమద్బగవద్గీత-1,2,3 https://www.freegurukul.org/z/BhagavadGita-41

జ్ఞానేశ్వరి-2,3 https://www.freegurukul.org/z/BhagavadGita-42

నీలకంఠీయ భగవద్గీతా భాష్యము https://www.freegurukul.org/z/BhagavadGita-43

గీతా యోగము https://www.freegurukul.org/z/BhagavadGita-44

గీతా భావార్ధ చంద్రిక https://www.freegurukul.org/z/BhagavadGita-45

భగవద్గీత విజ్ఞానదీపిక https://www.freegurukul.org/z/BhagavadGita-46

శ్రీ భగవద్గీత - గీతార్ధ దీపికా సహితము https://www.freegurukul.org/z/BhagavadGita-47

గీతామృతము https://www.freegurukul.org/z/BhagavadGita-48

వాసు దేవః సర్వం https://www.freegurukul.org/z/BhagavadGita-49

గీతా మాధుర్యం https://www.freegurukul.org/z/BhagavadGita-50

గీతా వచనము https://www.freegurukul.org/z/BhagavadGita-51

గీతా మహత్యం https://www.freegurukul.org/z/BhagavadGita-52

గీతా మాధుర్యము https://www.freegurukul.org/z/BhagavadGita-53

రెండు గీతలు భగవద్గీత-ఉత్తరగీత https://www.freegurukul.org/z/BhagavadGita-54

స్వస్వరూప సంధానము https://www.freegurukul.org/z/BhagavadGita-55

భగవద్గీత పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul
Whatsapp: 9042020123(To get this type of messages, SAVE this number and send START message)

Sunday 24 May 2020

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo... Facebook page and Blog available for Telugu Readers....

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo... Facebook page and Blog available for Telugu Readers....

Sri Bhagavad Gita Telugu lo...Chapter 18 sloka 77 to 78

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita Telugu lo...
Chapter 18 sloka 77 to 78
Sloka 77-మరియు, శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడినై, పదేపదే మహదానందముతో పులకించి పోతున్నాను.
Sloka 78- ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల-సమృద్ధి మరియు ధర్మమూ ఉంటాయి - అని నా నిశ్చిత అభిప్రాయము.
Chapter 18 completed.
జై శ్రీ కృష్ణ ....  జై శ్రీ రామ్ 

హరి ఓం తత్ సత్ 
హరి హీ ఓం 
ఓం తత్ సత్ 

దేవుడు నారాయణుడు ఒకడే , మరిఒక్క దేవుడు లేరూ  లేరూ.... యజుర్వేద 

విష్ణు ఒక్కడే పూజకు హరు హుడు - రిగ్వేద 
 
ఇక శెలవు ......... హరి హారయా నమః 
ఓం నమః నారాయణాయ 
ఓం నమః శివ్యయా 
శ్రీ రామ చంద్ర నారాయణ ....

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 70 to 76

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 70 to 76
Sloka 70-మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే (తమ బుద్ధిచే) నన్ను ఆరాధించినట్టు; అని నా అభిప్రాయము.
Sloka 71-శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.
Sloka 72-ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రత తో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా?
Sloka 73-అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా (దోషరహితుడా), నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
Sloka 74-సంజయుడు పలికెను: ఈ విధంగా, నేను, వాసుదేవుని పుత్రుడు శ్రీ కృష్ణుడికి మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనది అంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
Sloka 75-వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.
Sloka 76-సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదేపదే గుర్తుచేసుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 63 to 69

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 63 to 69
Sloka 63-ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాలకన్నా పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేసాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము.
Sloka 64-నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము, అది సమస్త జ్ఞానములో కెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి.
Sloka 65-ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి.
Sloka 66-అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విముక్తి చేసెదను, భయపడకుము.
Sloka 67-ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నుడు కాని వానికి, భక్తి లేని వానికి చెప్పకూడదు. (ఆధ్యాత్మిక విషయములు) వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు, మరియు ప్రత్యేకంగా నాపట్ల అసూయ కలవారికి కూడా దీనిని చెప్పకూడదు.
Sloka 68-ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు.
Sloka 69-వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు; వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 56 to 62

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 56 to 62
Sloka 56-నా భక్తులు సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా, నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు.
Sloka 57-నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము.
Sloka 58-నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ ఒకవేళ, అహంకారముచే, నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు.
Sloka 59-ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై , "నేను యుద్ధం చేయను" అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్ధమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క స్వంత (క్షత్రియ) భౌతిక స్వభావమే నిన్ను యుద్ధము చేయటానికి పురికొల్పుతుంది.
Sloka 60-ఓ అర్జునా, మోహప్రభావముచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో, నీ యొక్క సహజసిద్ధ స్వభావముచే జనించిన ప్రేరణ చే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడుతావు.
Sloka 61-ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.
Sloka 62-సంపూర్ణ హృదయ పూర్వకముగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము, ఓ భరతా. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 49 to 55

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 49 to 55
Sloka 49-ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.
Sloka 50-ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని (కర్మ సన్న్యాసములో) పొందిన వ్యక్తి, ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా, బ్రహ్మాం ను కూడా ఎలా పొందగలడో - వివరిస్తాను, నా నుండి క్లుప్తముగా వినుము.
Sloka 51 to 53-వ్యక్తి ఎప్పుడైతే - పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, మరియు ఇంద్రియములను చక్కగా నిగ్రహించి, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్ధము - లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై, పరబ్రహం తో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. (అంటే, పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో తెలుసుకోవటం).
Sloka 54-పరబ్రహ్మాంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంతచిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందును.
Sloka 55-కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్ధముగా నేను ఎవరో (ఎంతటివాడినో) తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 43 to 48

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 43 to 48
Sloka 43-శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలోనుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్ధ్యము - ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు.
Sloka 44-వ్యవసాయం, పాడిపంటలు, మరియు వర్తకవాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి.
Sloka 45-స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ/నిర్వర్తిస్తూ పరిపూర్ణత ను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నానుండి వినుము.
Sloka 46-తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి - సమస్త భూతములూ ఎవని నుండి ఊద్భవించాయో మరియు ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో - వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు.
Sloka 47-పర (ఇతరుల) ధర్మము చేయుటకంటే, సరిగ్గా చేయలేకపోయినా సరే, తన స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.
Sloka 48-తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలు ఉన్నాసరే ఎన్నటికీ విడిచిపెట్టరాదు, ఓ కుంతీ పుత్రా. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు, సమస్త కర్మ ప్రయాసలూ, ఏదోఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 36 to 42

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 36 to 42
Sloka 36-ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి.
Sloka 37-మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతం లాగా ఉండే సుఖమే సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది.
Sloka 38-ఇంద్రియములతో ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేత కలిగిన సుఖమును రాజసిక (రజో గుణ) సుఖము అని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది.
Sloka 39-ఏదైతే ఆనందము - ఆత్మ యొక్క అస్థిత్వమును పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, మరియు నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో - అది తామసిక (తమోగుణములో) ఆనందము అని చెప్పబడును.
Sloka 40-ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు.
Sloka 41-బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు - వీరి యొక్క విధులు వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. (పుట్టుక పరంగా కాదు).
Sloka 42-శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్చత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 29 to 35

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 29 to 35
Sloka 29-ఇప్పుడు వినుము ఓ అర్జునా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను.
Sloka 30-ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు బుద్ధి సత్త్వగుణములో ఉన్నది అని చెప్పబడును.
Sloka 31-ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి , రజోగుణములో ఉన్నట్టు.
Sloka 32-చీకటితో ఆవృత్తమై, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి.
Sloka 33-యోగము ద్వారా పెంపొందించుకున్న ధృడ చిత్త సంకల్పము; మరియు మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని, సత్త్వ గుణ దృఢమనస్కత అంటారు.
Sloka 34-ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము (విధులు), కామము (సుఖములు) మరియు అర్థము(సంపద) పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును.
Sloka 35-విడువకుండా, పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనవుతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ది సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు.
To be continued..

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 22 to 28
Sloka 22-సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది.
Sloka 23-ఏదైతే కర్మ - శాస్త్రబద్దముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో, అది సత్త్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది.
Sloka 24-స్వార్ధ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును
Sloka 25-మోహభ్రాంతి వల్ల ప్రారంభించి, తమ యొక్క స్వ-శక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా - చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు.
Sloka 26-అహంకారము మరియు సంగ రహితముగా ఉన్నవారు, మరియు ఉత్సాహము, ధృడసంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు సత్త్వగుణ కర్తలు అని చెప్పబడ్డారు.
Sloka 27-కర్మఫలముల పట్ల ఆసక్తి తో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమవుతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడుతాడు.
Sloka 28-క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్దకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసేవారిని - తమోగుణ కర్తలు అనవచ్చు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 15 to 21

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 15 to 21
Sloka 15 to 16-శరీరము, వాక్కు, మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యదార్ధమును గ్రహింపలేరు.
Sloka 17-కర్తృత్వ అహంకార భావమును (చేసేది నేనే అన్న భావమును) విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు.
Sloka 18-జ్ఞానము, జ్ఞేయము (జ్ఞాన విషయము), జ్ఞానమును ఎఱింగినవాడు - ఇవి మూడు కర్మను ప్రేరేపించును. కరణము, క్రియ, కర్త, - ఈ మూడు కర్మ యొక్క అంగములు.
Sloka 19-జ్ఞానము, కర్మ, మరియు కర్త - ఇవి ప్రకృతి త్రి-గుణముల పరముగా ఒక్కోటి మూడు రకాలుగా ఉంటాయని సాంఖ్య శాస్త్రము పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెప్తాను వినుము.
Sloka 20-సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనశ్వరమైన ఒకే అస్థిత్వము ఉన్నట్టు తెలుసుకోనటమే సత్త్వ గుణము లో ఉన్న జ్ఞానము.
Sloka 21-ఏ జ్ఞానము చేతనయితే భిన్నభిన్న దేహములలో ఉన్న వివిధ రకముల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానము రాజసికమని (రజోగుణములో ఉన్న) గ్రహించుము.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 8 to 14
Sloka 8-విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను, అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరిక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి, వాటిని విడిచిపెట్టటాన్ని, రజో గుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు.
Sloka 9-అర్జునా, కర్తవ్యమునకు అనుగుణముగా ఎప్పుడైతే కర్మలు చేయబడుతాయో, మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో, దానిని సత్త్వగుణ త్యాగము అంటారు.
Sloka 10-నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన/అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు.
Sloka 11-దేహమును కలిగున్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే, తన కర్మ ఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని చెప్పబడును.
Sloka 12-స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి, మరణించిన పిదప కూడా, - సుఖము, దుఃఖము మరియు ఈ రెంటి మిశ్రమము - ఈ మూడు విధములుగా కర్మ ప్రతిఫలములు ఉండును. కానీ, కర్మఫల త్యాగము చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఉండవు.
Sloka 13-ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము, అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది.
Sloka 14-శరీరము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము - ఇవే కర్మ యొక్క ఐదు అంగములు.
To be continued..

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 1 to 7
Sloka 1-అర్జునుడు పలికెను : ఓ మహాబాహువులు కల కృష్ణా, 'సన్యాసము' (కర్మలను త్యజించటము) మరియు 'త్యాగము' (కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటమూ) ల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషీకేశా, వాటి మధ్య తేడాని కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది, ఓ కేశినిషూదనా.
Sloka 2-శ్రీ భగవానుడు ఇలా పలికెను : కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగము అని అన్నారు.
Sloka 3-కొంతమంది జ్ఞానసంపన్నులు అన్ని రకముల కర్మలను దోషభూయిష్టమైనవి అని వాటిని విడిచిపెట్టాలి అంటారు, అదే సమయంలో మరికొంతమంది, యజ్ఞము, దానము మరియు తపస్సు లను ఎన్నడూ విడిచిపెట్టవద్దు అంటారు.
Sloka 4-త్యాగము అన్న విషయముపై ఇక ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము, ఓ పురుషవ్యాఘ్రమా, త్యాగము అనేది మూడు విధములుగా ఉంటుంది అని చెప్పబడినది.
Sloka 5-యజ్ఞము, దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు; అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి.
Sloka 6-ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు, ఓ అర్జునా.
Sloka 7-విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 17 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 17 sloka 22 to 28
Sloka 22-అనుచిత ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హతలేనివారికి (అపాత్రులకు), మర్యాద చూపకుండా, లేదా చులకనగా ఇవ్వబడిన దానము, తామసదానము గా పరిగణించబడుతుంది.
Sloka 23-"ఓం తత్ సత్" అన్న పదములు, సృష్టి మొదలు నుండి, పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులు, శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి.
Sloka 24- కాబట్టి, యజ్ఞములు చేయటంలో, దానము ఇవ్వటంలో, తపస్సులు ఆచరించటం లో - వేద విదులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ 'ఓం' అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు.
Sloka 25-ప్రతి-ఫలములను ఆశించని వారు, కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారు, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు "తత్" అన్న పదమును ఉచ్చరిస్తారు.
Sloka 26 to 27-"సత్" అన్న పదానికి అర్థం - సనాతనమైన అస్థిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ "సత్" అన్న పదము వివరిస్తుంది. కావున, ఈ ప్రయోజనము తో ఉన్న ఏ పని అయినా "సత్" అనబడుతుంది.
Sloka 28-ఓ ప్రిథ పుత్రుడా, అశ్రద్దతో చేయబడిన దానములు కానీ, యజ్ఞములు కానీ "అసత్" అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు.
To be continued with chapter 18

Sri Bhagavad Gita telugu lo...Chapter 17 sloka 15 to 21

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 17 sloka 15 to 21
Sloka 15-ఉద్వేగమును కలిగించని మాటలు, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రియ హితమైనవి మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది.
Sloka 16-ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము మరియు భావములో పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పెర్కొనబడినాయి.
Sloka 17-భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, వాటిని సాత్త్విక తపస్సులు అని అంటారు.
Sloka 18-కీర్తిప్రతిష్టలు, గౌరవము, మరియు గొప్పల కోసం, ఆడంబరంగా చేసే తపస్సు/యజ్ఞములు రజో గుణములో ఉన్నట్టు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి, మరియు తాత్కాలికమైనవి.
Sloka 19-అయోమయ భావాలతో, తమని తామే హింసపెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు, తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది.
Sloka 20-దానము చేయుట కర్తవ్యము (సరియైన పని) అని భావించి, తగిన పాత్రత ఉన్నవాడికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది.
Sloka 21-అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఎదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజో గుణములో ఉన్నదని చెప్పబడినది.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 17 sloka 8 to 15

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 17 sloka 8 to 15
Sloka 8-సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు - ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.
Sloka 9-అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్ధములు రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియి వ్యాధులను కలుగ చేస్తాయి.
Sloka 10-ఎండిపోయిన/మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము - తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి.
Sloka 11-ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ, ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో ధృఢ సంకల్పము తో, చేసిన యజ్ఞము సత్త్వ గుణము తో చేయబడినట్టు.
Sloka 12-ఓ, భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము.
Sloka 13-శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాల విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును.
Sloka 14-పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు మరియు పెద్దలు - వీరి ఆరాధన, శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యం, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడుతాయో - అది శారీరిక తపస్సు అని చెప్పబడును.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 17 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 17 sloka 1 to 7
Sloka 1-అర్జునుడు ఇలా అన్నాడు : ఓ కృష్ణా, శాస్త్ర విధులను త్యజించి (విస్మరించి) ఉండి, అయినా శ్రద్ధావిశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్త్వ గుణం లో ఉంటుందా లేదా రజో, తమో గుణములలో ఉంటుందా?
Sloka 2-శ్రీ భగవానుడు ఇలా పలికెను : ప్రతి ఒక్క మానవుడు తన సహజసిద్ధ శ్రద్ధ/విశ్వాసము తో జన్మిస్తాడు, ఇది మూడు రకాలుగా - సాత్త్వికము, రాజసము, లేదా తామసము - గా ఉండవచ్చు. ఇప్పుడు ఇక ఈ విషయంపై నానుండి వినుము.
Sloka 3-అందరు మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి, మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వము గా ఉంటుంది.
Sloka 4-సత్త్వ గుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు; రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు; తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు.
Sloka 5 to 6-కొంతమంది జనులు, అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్రవిరుద్ధమైనా, తమ దంభం(కపటత్వం) మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై, వారు తమ శరీర అవయములనే కాక, వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము.
Sloka 7-వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞములు, తపస్సు, మరియు దానములు కూడా వారియొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ బేధముల గురించి వినుము.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 16 sloka 19 to 24

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 16 sloka 19 to 24
శ్రీ భగవానుడు పలికెను
Sloka 19 to 20 -కౄరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు, అధములు, నీచ నరులను, నేను, భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో,  పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక, ఓ అర్జునా, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి.
Sloka 21-ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు మూడు ఉన్నాయి - కామము, క్రోధము, మరియు లోభము. కాబట్టి, అందరూ వీటిని విడిచిపెట్టాలి.
Sloka 22-చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు, ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు, తద్వారా  వారు  పరమ లక్ష్యమును పొందుతారు.
Sloka 23-ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని  కానీ, సుఖానందమును కానీ, చివరకి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు.
Sloka 24-కాబట్టి, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధివిధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము.
To be continued with chapter 17

Sri Bhagavad Gita telugu lo...Chapter 16 sloka 13 to 18

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 16 sloka 13 to 18
Sloka 13 to 15- ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు, "నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా ఉంటుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు, నేను మిగతావారిని కూడా నాశనం చేస్తాను! నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేను శక్తిమంతుడను మరియు నేను సుఖంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు నా బంధువులు గొప్ప హోదాలో ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను (దేవతలకు) యజ్ఞములు చేస్తాను; దానములు ఇస్తాను; ఆనందిస్తాను." ఈ విధంగా, వారు అజ్ఞానముచే మోహితులై పోతారు.
Sloka 16-ఇటువంటి ఊహలు, తలపులతో తప్పుదారి పట్టి, మోహమనే వలలో చిక్కుకుపోయి, మరియు ఇంద్రియములను తృప్తి పరచటానికకే బానిసైపోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు.
Sloka 17-ఇటువంటి స్వార్ధ-చింతనతో ఉన్న మూర్ఖపు మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి,  శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు.
Sloka 18-అహంకారము, బలము, గర్వము, కామము, మరియు కోపముచే కళ్ళుమూసుకు పోయి, ఈ అసురీ ప్రవృత్తి కలవారు, తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ/ద్వేషిస్తూ ఉంటారు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 16 sloka 7 to 12

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 16 sloka 7 to 12
Sloka 7-ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ, లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు.
Sloka 8-వారు ఇలా అంటారు, "ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన (నైతిక నియమ) ఆధారము లేదు, మరియు భగవంతుడు (దీనిని సృష్టించింది లేదా నిర్వహించేది) అనేవాడు ఎవరూ లేరు. ఇదంతా స్త్రీ-పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు."  అని.
Sloka 9-ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి, ఈ తప్పుదోవపట్టిన జీవాత్మలు, అల్ప బుద్ధితో మరియు కౄర (ఉగ్ర) కార్యములతో, ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వసం చేయభయపెడుతారు.
Sloka 10-విపరీత కామము, దంభము, దురభిమానము తో నిండి,  గర్వము మరియు అహంకారంతో, ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకునివుంటారు. ఈ విధంగా మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర బుద్ధితో ప్రవర్తిస్తారు.
Sloka 11-వారు అంతులేని చింతా-ఆందోళనలు చివరికి మరణం తోనే ముగుస్తాయి. అయినా సరే, వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు.
Sloka 12-వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడి, మరియు కామ క్రోధములచే ఆవరించబడి, వారు అన్యాయ పద్దతులలో సంపదను ప్రోగుచేయటానికి శ్రమిస్తారు,  ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 16 sloka 1 to 6

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 16 sloka 1 to 6
Sloka 1 to 3- శ్రీ భగవానుడు పలికెను : ఓ భరత వంశీయుడా,   దైవీ సంపద కలవాని లక్షణములు ఇవి - నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో ధృఢసంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంధ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం; అహింస, సత్య సంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణులపట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణుకువ మరియు నిశ్చలత్వము; బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట మరియు డాంభికము లేకుండుట.
Sloka 4-ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావము కల వారి గుణములు.
Sloka 5-దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ, ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి. బాధపడకు అర్జునా, నీవు దైవీ గుణములతోనే జన్మించావు.
Sloka 6-ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు - దైవీ గుణములు కలిగిఉన్నవారు  మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను, ఓ అర్జునా, ఆసురీ స్వభావమును గురించి చెప్తాను, వినుము.
To be continued...

Sri Bhagavad Gita telugu lo..Chapter 15 sloka 14 to 20

శ్రీ భగవద్ గీత తెలుగు లో-Sri Bhagavad Gita telugu lo..
Chapter 15 sloka 14 to 20
Sloka 14-నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు ఒంటబట్టించుకొనటానికి, జీవుల ఉదరములలో ప్రాణాపానసంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను.
Sloka 15-నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు విస్మృతి (మర్చిపోవుట) కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదార్ధమును తెలిసినవాడను నేనే.
Sloka 16-సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి, క్షరములు (నశించేవి) మరియు అక్షరములు (నశించనివి). భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు.
Sloka 17-ఇవే కాక, నాశరహితమైన పరమాత్మ అయిన, ఆ పురుషోత్తముడు, ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి, సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు.
Sloka 18-నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్ధముకంటెనూ, మరియు నాశరహితమైన జీవాత్మ కంటెనూ కూడా అతీతమైనవాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడి గా కీర్తింపబడ్డాను.
Sloka 19-ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.
Sloka 20-ఓపాపరహితుడా, అర్జునా, అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును నేను నీకు తెలియచేసాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు.
To be continued with chapter 16

Sri Bhagavad Gita telugu lo...Chapter 15 sloka 7 to 13

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 15 sloka 7 to 13
Sloka 7-భౌతిక జగత్తులోఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశలే. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు.
Sloka 8-ఎలాగైతే గాలి, సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీస్కువెళుతుందో, జీవాత్మ కూడా, పాత శరీరమును విడిచి, కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది.
Sloka 9-మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు - చెవులు, కన్నులు, చర్మము, నాలుక మరియు ముక్కు - వీటి యొక్క గ్రహణశక్తితో, జీవాత్మ ఇంద్రియ వస్తువిషయములను ఆస్వాదిస్తుంటుంది.
Sloka 10-జీవాత్మను - అది ఇంద్రియ వస్తువిషములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ లేదా అది దేహమును విడిచివెళ్లినప్పుడు కానీ - అజ్ఞానులు గమనించరు. కానీ జ్ఞాన నేత్రములు కలవారు దానిని దర్శించగలరు.
Sloka 11-గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ, ఎంత ప్రయత్నించినా, అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు.
Sloka 12-సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొనుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొనుము.
Sloka 13-పృథ్వి యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి, నేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి, సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను.
To be continued..

Sri Bhagavad Gita telugu lo...Chapter 15 sloka 1 to 6

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 15 sloka 1 to 6
Sloka 1-శ్రీ భగవానుడు పలికెను : వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు.
Sloka 2-త్రి-గుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి, ఇంద్రియ విషయములు వాటికి చిగుళ్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేళ్ళాడుతూ ఉంటాయి. క్రిందిన, దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి, మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి.
Sloka 3 to 4-ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో తెలియబడదు, దాని యొక్క మొదలు, చివర లేదా సనాతన అస్థిత్వము కూడా అర్థం కాదు. కానీ, ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి/వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి, అదియే ఆ భగవంతుడు, ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము.
Sloka 5-దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తిని జయించినవారు, సతతమూ ఆత్మ, భగవంతుని చింతన లోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములనెడి ద్వందములకు అతీతులై ఉన్నవారు - ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు.
Sloka 6-సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 14 sloka 22 to 27

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 14 sloka 22 to 27
Sloka 22 to 23-శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైనవారు -  (సత్త్వ గుణ జనితమైన) ప్రకాశమును కానీ, (రజో గుణ జనితమైన) కార్యకలాపములను కానీ, లేదా (తమో గుణ జనితమైన) మోహభ్రాంతిని కానీ - అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మ యందే స్థితమై  ఉంటారు.
Sloka 24 to 25-సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు; ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు; మట్టిముద్ద, రాయి, బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు; అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు; తెలివైన వారు; నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు; గౌరవమును, అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు; శత్రువుని, మిత్రుడిని ఒకలాగే చూసేవారు; అన్ని యత్నములను విడిచిపెట్టినవారు - వీరు త్రిగుణములకు అతీతులైనవారు అని చెప్పబడుతారు.
Sloka 26-నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులై  పోవుదురు మరియు బ్రహ్మం స్థాయికి చేరుతారు.
Sloka 27-ఆ యొక్క సనాతనమైన, అవ్యయమైన నిరాకార బ్రహ్మాంమునకు, సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు, నేనే ఆధారము.
To be continued with chapter 15

Sri Bhagavad Gita telugu lo...Chapter 14 sloka 16 to 22

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 14 sloka 16 to 22
Sloka 16-సత్త్వ గుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణము లో చేసిన పనులు, దుఃఖాలను కలుగ చేస్తాయి, మరియు, తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి.
Sloka 17-సత్త్వ గుణముచే జ్ఞానము, రజో గుణము చే లోభము(దురాశ), మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము (భ్రాంతి) జనించును.
Sloka 18-సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు మధ్య (లోకాల) లోనే ఉండిపోతారు; తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలైతారు.
Sloka 19-అన్ని పనులలో, చేసేది ఈ త్రి-గుణములే, ఇతర వేరే ఏవీ లేవు, అని ఎప్పుడైతే వివేవవంతులు తెలుసుకుంటారో, మరియు నేను వీటికి అతీతమైనవాడను అని తెలుసుకుంటారో - వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు.
Sloka 20-దేహ సంబంధమయిన ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన, వ్యక్తి, జన్మ, వ్యాధి, మృత్యువు, వృద్ధాప్యముల దుఃఖముల నుండి విముక్తి పొంది, అమరత్వం పొందుతాడు.
Sloka 21-అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవాడి లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఓ ప్రభూ? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 14 sloka 9 to 15

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 14 sloka 9 to 15
Sloka 9-సత్త్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది; రజో గుణము జీవాత్మను కర్మల పట్ల ఆసక్తి పరుస్తుంది; మరియు తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతి కి బంధించివేస్తుంది.
Sloka 10-ఒక్కోసారి రజోతమస్సులపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి  సత్త్వము మరియు తమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది; మరియు ఇంకాకొన్ని సార్లు సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది.
Sloka 11 to 13-దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వ గుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభము (దురాశ), ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.
Sloka 14 to 15- సత్త్వ గుణ ప్రధానముగా ఉండి మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను  (రజస్సు, తమస్సు లేనటువంటివి)  చేరుకుంటారు. రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు పనులతో ప్రేరణ పొందేవారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉండి మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు.

To be continued....

Sri Bhagavad Gita telugu lo...Chapter 14 slokas 1 to 8

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 14 slokas 1 to 8
Sloka 1- శ్రీ భగవానుడు పలికెను: నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన  జ్ఞానమును నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు.
Sloka 2-ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు, సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు.
Sloka 3 to 4 -ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో  నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను, ఆ విధంగా సమస్త జీవరాశులు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతి యే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని.
Sloka 5-ఓ మహా బాహువులు కల అర్జునా, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది - సత్త్వ గుణము, రజో  గుణము, మరియు తమో గుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నాశనమయ్యే దేహమునకు బంధించును.
Sloka 6-వీటిలో సత్త్వ గుణము మిగతావాటి కంటే పవిత్రమైనది, ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది.  ఓ పాప రహితుడా, జ్ఞానము మరియు సుఖానుభవము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది.
Sloka 7-ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తి తో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు అనురాగముల వలన జనిస్తుంది మరియు ఆత్మను కామ్య కర్మల పట్ల ఆసక్తి చే బంధించివేస్తుంది.
Sloka 8-ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్ర చే భ్రమకు గురి చేస్తుంది.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 13 sloka 28 to 35

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 13 sloka 28 to 35
Sloka 28-సమస్త ప్రాణులలో వాటి ఆత్మ తో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే, మరియు ఆ రెంటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే, నిజముగా చూసినట్టు.
Sloka 29-సర్వ ప్రాణులలో సమానముగా, పరమాత్మ గా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు, తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా, వారు పరమ పదమునకు చేరుకుంటారు.
Sloka 30-(శరీరము యొక్క) అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే, జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు - అని అర్థంచేసుకున్నవాడు నిజముగా చూసినట్టు.
Sloka 31-విభిన్న వైధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు.
Sloka 32-ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనివాడు, అనాదియైనవాడు, భౌతిక లక్షణములు ఏవీ లేనివాడు. దేహములోనే స్థితమై ఉన్నా, ఆయన ఏమీ చేయడు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాడు.
Sloka 33-ఆకాశము (ఖాళీ జాగా) అన్నింటిని తనలోనే కలిగిఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితముకాదు. అదే విధముగా, దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.
Sloka 34-ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో, అలాగే ఒక్క ఆత్మ యే మొత్తం శరీరమును (చైతన్యము చే) ప్రకాశింపచేయును.
Sloka 35-జ్ఞాన-చక్షువులచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గమనించేవారు, మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్దతి తెలిసినవారు, పరమ పదమును చేరుకుంటారు.
To be continued with chapter 14

Sri Bhagavad Gita telugu lo...Chapter 13 sloka 21 to 27

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 13 sloka 21 to 27
Sloka 21-సృష్టిలో కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని; సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో, జీవాత్మ యే బాధ్యుడు అని చెప్పబడినది.
Sloka 22-ఎప్పుడైతే ప్రకృతిలో (భౌతిక శక్తి) లో స్థితమై ఉన్న పురుషుడు (జీవాత్మ) త్రిగుణములను సుఖించదలచాడో, వాటి పట్ల మమకారాసక్తియే, ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును.
Sloka 23-దేహములోనే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన, సర్వసాక్షి, సర్వ నియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట అధికారి మరియు పరమాత్మ, అని చెప్పబడుతాడు.
Sloka 24-పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యదార్ధమును అర్థం చేసుకున్న వారు, మళ్ళీ ఇక ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలాఉన్నా వారు విముక్తి చేయబడతారు.
Sloka 25-కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు; మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు, ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు.
Sloka 26-ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు, వాటి గురించి వేరే వారి దగ్గర విని, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలుపెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత, వారు కూడా క్రమక్రమంగా ఈ జనన-మరణ సంసార సాగరాన్ని దాటగలరు.
Sloka 27-ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, నీవు ఈ సమస్త చరాచర ప్రాణులు, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క కలయిక వలననే ఉన్నాయని తెలుసుకొనుము.
To be continued

Sri Bhagavad Gita telugu lo...Chapter 13 Sloka 15 to 20

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 13  Sloka 15 to 20
Sloka 15-ఇంద్రియ వస్తువిషయములను అన్నింటినీ ఆయన తెలుసుకొనగలిగినా, ఆయన ఇంద్రియ రహితుడు. ఆయనకు దేనిపట్ల కూడా మమకారానుబంధము లేదు, అయినా ఆయనే అన్నింటిని సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయినా, ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే.
Sloka 16-ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్షమైన వాడు, కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంలో ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు.
Sloka 17-ఆయన విభజించుటకు వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే, సమస్త భూతములకు (ప్రాణులకు) సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము.
Sloka 18-అన్ని తేజోమయవస్తువుల్లో ఆయనే ప్రకాశానికి మూలము, మరియు అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే, మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో ఉంటాడు.
Sloka 19-ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును, మరియు జ్ఞాన విషయమును, నేను తెలియచేసాను. నా భక్తులు మాత్రమే దీనిని యదార్థముగా అర్థం చేసుకోగలరు, అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు.
Sloka 20-ప్రకృతి (భౌతిక ప్రకృతి) మరియు పురుషుడు (ఆత్మలు) రెండూ కూడా అనాదియైనవి (సనాతనమైనవి). శరీరములోని అన్ని మార్పులూ మరియు ప్రకృతి త్రిగుణములూ కూడా, భౌతిక శక్తి చే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 13 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 13 sloka 8 to 14
Sloka 8 to 12- నమ్రత; దంభము (కృత్తిమ బుద్ధి) లేకుండా ఉండుట; అహింస; క్షమా గుణము; సరళత; గురు సేవ; శరీర-మనస్సుల పరిశుద్ధత; నిశ్చల బుద్ధి; మరియు ఆత్మ-నిగ్రహము; ఇంద్రియభోగ వస్తువిషయములపై అనాసక్తి; అహంకారము లేకుండుట; జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం; మమకారరాహిత్యం; భార్య(భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటిని అంటుకొని (యావ) లేకుండా ఉండుట; జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట; నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట; ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి; ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం; మరియు పరమ సత్యముకై తత్త్వాన్వేషణ - ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను, మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను.
Sloka 13-ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో, నీకు దానిని ఇప్పుడు నేను తెలియచేస్తాను, అది తెలుసుకున్న తరువాత, వ్యక్తి అమరత్వం పొందుతాడు. అదియే, సత్, అసత్ లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మాం.
Sloka 14-సర్వత్రా ఆయన పాదములు, కన్నులు, శిరస్సులు మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 13 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 13 sloka 1 to 7
Sloka 1-అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! ప్రకృతి మరియు పురుషుని (భోక్త) గూర్చియు, క్షేత్రము మరియు క్షేత్రము నెరిగినవానిని గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞానలక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను.
Sloka 2-శ్రీకృష్ణభగవానుడు పలికెను; ఓ కౌంతేయా! ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును.
Sloka 3-ఓ భరతవంశీయుడా ! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము.
Sloka 4-వినుము, క్షేత్రము అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్ధ్యము ఏమిటో కూడా వివరిస్తాను.
Sloka 5-మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కువిధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది, ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది.
Sloka 6-పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు), మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము ఉన్నది.
Sloka 7-ఇచ్ఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము - ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు (వికారములు) అనబడుతాయి.
To be continued...

Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 12 sloka 15 to 20

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 12 sloka 15 to 20
Sloka 15-ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.
Sloka 16-సాధారణ కార్యకలాపముల నాశ్రఇంపనివాడును, పవిత్రుడును, సమర్తుడును, ఉదాసీనుడును, సర్వవ్యథల నుండి ముక్తుడైనవాడును, ఏదేని ఫలము కొరకై తీవ్రకృషి చేయనివాడును అగు నా భక్తుడు నాకు మిగుల ప్రియుడు.
Sloka 17-ఉప్పొంగుటగాని దుఃఖించుటగాని తెలియనివాడు, శోకించుటగాని వాంచించుట గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటిని త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు.
Sloka 18 to 19-శత్రుమిత్రుల యెడ సమభావము కలిగినవాడును, మానావమానములందు, శీతోష్ణములందు, సుఖదుఃఖములందు, నిందాస్తుతులందు సమబుద్ధి కలిగినవాడును, అసత్సంగము నుండి సదా విడివడియుండువాడును, సదా మౌనియైనవాడును, దేనిచేతనైనను సంతుష్టి నొందెడివాడును, నివాసమేదైనను లెక్క చేయనివాడును, జ్ఞానమునందు స్థితుడైనవాడును, నా భక్తియుతసేవ యందు నియుక్తుడైనట్టివాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు.
Sloka 20-నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తియోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు.
To be continued with chapter 13

Sri Bhagavad Gita telugu lo...Chapter 12 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 12 sloka 8 to 14
Sloka 8-దేవదేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు.
Sloka 9-ఓ అర్జునా! ధనంజయా! స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో, భక్తియోగమునందలి విధివిధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధిచేసికొనుము.
Sloka 10-భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మచేయుట ద్వారా నీవు పూర్ణశక్తిని పొందగలవు.
Sloka 11-అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో త్యాగము చేసి ఆత్మస్థితుడవగుట యత్నింపుము.
Sloka 12-ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞానసముపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికిని జ్ఞానముకన్నను ధ్యానము మేలైనది. కాని త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మఫల త్యాగము ఆ ధ్యానము కన్నను మేలితరమైనది.
Sloka 13 to 14-ద్వేషమనునది లేకుండ సర్వజీవుల యెడ మైత్రిని కలిగినవాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖదుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైనవాడును, ఆత్మనిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢనిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 12 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 12 sloka 1 to 7
Sloka 1-అర్జునుడు ప్రశ్నించెను : నీ భక్తియుతసేవలో సదా యుక్తముగా నియుక్తులైనవయు మరియు అవ్యక్త నిరాకారబ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుదురు?
Sloka 2-శ్రీకృష్ణభగవానుడు పలికెను: నా స్వీయరూపము నందు మనస్సును లగ్నము చేసి దివ్యమును, ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైనవారు అత్యంత పరిపూర్ణములని నేను భావింతురు.
Sloka 3-4- ఇంద్రియాతీతమును,సర్వవ్యాపకమును, అచింత్యమును, మార్పురహితమును, స్థిరమును, అచలమును అగు అవ్యక్త తత్త్వమును (పరతత్త్వపు నిరాకార భావనను) సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వల యెడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైనవారు సైతము అంత్యమున నన్ను పొందుదురు.
Sloka 5-పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్త్వము నందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి యనునది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడును కష్టతరమే. 
Sloka 6 to 7- కాని ఓ పార్థా! సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింతలేక నాకు భక్తులై, మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు, నా భక్తియుత సేవలో నన్ను అర్చించెడివారిని శీఘ్రమే జనన, మరణమను సంసారసాగరము నుండి ఉద్ధరింతును.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 50 to 55

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 50 to 55
Sloka 50-ధృతరాష్ట్రునితో సంజయుడు పలేకెను : దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజరూపమును ప్రదర్శించెను. భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఆశ్వాసమును గూర్చుచు అంత్యమున తన ద్విభుజ రూపమును చూపెను.
Sloka 51-ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్యరూపమును గాంచినంత ఇట్లు పలికెను: ఓ జనార్ధనా! అత్యంత సుందరమైన ఈ నీ మానవరూపమును గాంచి శాంతచిత్తుడవై నా సహజస్వభావమును పొందితివి.
Sloka 52-శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవిపుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిగుల దుర్లభమైనది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించు నవకాశమునకై దేవతలు సైతము నిత్యమూ వేచియుందురు.
Sloka 53-దివ్యచక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము వేదాధ్యయనముచే గాని, తీవ్రతపస్సులచే గాని, దానముచే గాని, పూజలచేగాని అవగతము కాదు. మనుజుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవియన్నియును సాధనములు కాజాలవు.
Sloka 54-ఓ ప్రియమైన అర్జునా! కేవలము అనన్యభక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడినరీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహనా రహస్యములందు ప్రవేశింపగలుగుదువు.
Sloka 55-ఓ ప్రియమైన అర్జునా! కామ్యకర్మలు, మనోకల్పనలనెడి కల్మషముల నుండి విడివడి నా శుద్ధభక్తి యందు నియుక్తుడయ్యెడివాడును, నన్నే తన జీవితపరమగమ్యముగా భావించి నా కొరకై కర్మనొనరించువాడును, సర్వజీవుల యెడ మిత్రత్వమును కలిగినవాడును అగు మనుజుడు తప్పక నన్నే చేరగలడు.
To be continued with chapter 12

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 45 to 49

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 45 to 49
Sloka 45-ఇదివరకెన్నడును చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించితిని. కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా! జగాన్నివాసా! నా యెడ కరుణను జూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము.
Sloka 46-ఓ విశ్వరూపా! సహస్రబాహో! కిరీటము ధరించి శంఖ,చక్ర, గద, పద్మములను హస్తములందు కలిగియుండెడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదురు. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను.
Sloka 47-శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! ప్రసన్నుడైన నేను ణా అంతరంగశక్తిచే భౌతికజగమునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమును, అనంతమును, ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరును గాంచియుండలేదు.
Sloka 48-ఓ కురుప్రవీరా! వేదాధ్యయనముచేత గాని, యజ్ఞములచేత గాని, దానములచేత గని, పుణ్యకర్మలచేత గాని, ఉగ్రమగు తపస్సులచేత గాని భౌతికజగమున ఈ రూపములలో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరును గాంచి యుండలేదు. 
Sloka 49-నా ఈ ఘోరరూపమును చూచి నీవు కలతనొందినవాడవు, భ్రాంతుడవు అయితివి. అదియంతయు నిపుడు అంతరించును గాక, ఓ భక్తుడా! అన్ని కలతల నుండియు విముక్తుడవై నీవు కోరిన రూపమును ప్రశాంతమనస్సుతో ఇప్పుడు గాంచుము.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 39 to 44

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 39 to 44
Sloka 39-వాయువును మరియు పరం నియామకుడును నీవే! అగ్ని, జలము, చంద్రుడవు నీవే! ఆదిజీవియైన బ్రహ్మదేవుడవు మరియు ప్రపితామహుడవు నీవే. కనుకనే నీకు వేయినమస్కారములు జేయుచు, మరల మరల వందనముల నర్పించుచున్నాను.
Sloka 40-నీకు ముందు నుండి, వెనుక నుండి, సర్వదిక్కుల నుండి నమస్కారముల నర్పించుచున్నాను. ఓ అనంతవీర్యా! నీవు అమితవిక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి. కనుకనే సర్వమును నీవే అయి యున్నావు.
Sloka 41-42 -నీ మహిమము తెలియక నిన్ను మిత్రునిగా భావించి “ఓ కృష్ణా”, “ఓ యాదవా”, “ ఓ మిత్రమా” అని తొందరపాటుగా సంబోధించితిని. ప్రేమతోగాని లేదా మూర్ఖత్వముతోగాని నేనొరించిన దానినంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు ఒంటరిగా కొన్నిమార్లు మరియు పలుమిత్రుల సమక్షమున మరికొన్నిమార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరపరచితిని. ఓ అచ్యుతా! ఆ అపరాధములన్నింటికిని నన్ను క్షమింపుము.
Sloka 43-స్థావర, జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వమునకు నీవే తండ్రివి. దానికి ముఖ్యపూజనీయుడగు పరమ ఆధ్యాత్మికగురుడవు నీవే. నీతో సమానమైనవాడు గాని, ఏకమైనవాడుగాని మరొకడుండడు. ఓ అపరిమితశక్తి సంపన్నుడా! అట్టి యెడ నీ కన్నను అధికుడు ముల్లోకములలో ఎవడుండును?
Sloka 44-నీవు ప్రతిజీవికిని పూజనీయుడైన దేవదేవుడవు. కనుకనే సాష్టాంగపడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలిని ప్రియుడు సహించునట్లు, నీ యెడ నొనరించిన నా తప్పులను దయతో సహింపుము.
To be continued..

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 33 to 38

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 33 to 38
Sloka 33-అందుచే లెమ్ము. యుద్ధసన్నద్ధుడవై కీర్తిని గడింపుము. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యము ననుభవింపుము. ఓ సవ్యసాచీ! నా ఏర్పాటుచే వారందరును ఇదివరకే మరణించియున్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్తమాత్రుడవగుము.
Sloka 34-ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహా యోధులందరును నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏ మాత్రము వ్యథనొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు.
Sloka 35-ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను; ఓ రాజా! దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల మరల వందనముల నొసగెను. భీతిని కూడినవాడై అతడు డగ్గుత్తికతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.
Sloka 36-అర్జునుడు పలికెను : ఓ హృశీకేశా! నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించి, ప్రతియొక్కరు నీ యెడ అనురక్తులగుచున్నారు. సిద్ధసమూహములు నీకు గౌరవపుర్వకముగా అంజలి ఘటించుచున్నను రాక్షసులు భీతిచెందినవారై పలుదిక్కుల పలాయనమగుచున్నారు. ఇది యంతయు యుక్తముగనే ఉన్నది. 
Sloka 37-ఓ మహాత్మా! బ్రహ్మదేవుని కంటేను ఘనమైనవాడా! నీవే ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు నమస్సులు అర్పింపరు? ఓ అనంతా! దేవదేవా! జగన్నివాసా! నీవు అక్షయమగు మూలమువు, సర్వకారణకారణుడవు, ఈ భౌతికసృష్టికి అతీతుడవు.
Sloka 38-నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయము. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్యశరణ్యుడవు. ఓ అనంతరుపా! ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడియున్నది. 
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 Sloka 26 to 32

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 Sloka 26 to 32
Sloka 26-27 - తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్రతనయులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోళ్ళ యందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత శిరులై తగుల్కొనుటయు నేను గాంచుచున్నాను.
Sloka 28-నదీప్రవాహములు సముద్రమునందు ప్రవేశించు రీతి, ఈ మహాయోధులందరును నీ నోళ్ళ యందు ప్రవేశించి మండిపోవుచున్నారు.
Sloka 29-జ్వలించు అగ్ని యందు నాశము కొరకై శలభములు ప్రవేశించురీతి, జనులందరును అత్యంతవేగముగా నీ వక్త్రములందు ప్రవేశించుచున్నట్లు నేను గాంచుచున్నాను.
Sloka 30-ఓ విష్ణూ! నీవు సమస్తజనులను నీ మండుచున్న నోళ్ళ ద్వారా అన్ని వైపుల నుండియు మ్రింగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి, భయంకరములును మరియు తాపకరములును అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు.
Sloka 31-ఓ దేవవర! భయంకర రూపముతోనున్న నీవెవరవో నాకు దయతో తెలియజేయుము. నీకు వందనముల నర్పించెదను; నా యెడ ప్రసన్నుడవగుము. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమును ఎరుగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలిసికొనగోరుచున్నాను.
Sloka 32-దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను : నేను ఘనమైన లోకవినాశకర కాలమును. జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటకు అరుదెంచితిని. నీవు (పాండవులు) తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరును చంపబడనున్నారు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 Sloka 21 to 25

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 Sloka 21 to 25
Sloka 21-దేవతా సమూహములన్నియును నిన్ను శరణువేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు ముగుల భయవిహ్వలులై దోసలియొగ్గి ప్రార్థనలను గావించుచున్నారు. మహర్షులు, సిద్ధసమూహములు “శాంతి, శాంతి” యని పలుకుచు వేదమంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.
Sloka 22-పరమశివుని పలుమారులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీకుమారులు, మరత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు.
Sloka 23-ఓ మహాబాహో! బహుముఖములును, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నియు వ్యథ చెందుచున్నవి. వానివలెనే నేనును కలతచెందుచున్నాను.
Sloka 24-ఓ సర్వవ్యాపక విష్ణూ! పలు ప్రకాశమాన వర్ణములతో ఆకాశమును తాకుచు, విప్పారిన వక్త్రములు, తేజోమయమైన నేత్రములు కలిగిన నిన్ను గాంచి నా మనస్సు భీతిచే కలతనొందినది. మనోస్థిరత్వమును గాని, సమత్వమును గాని నేను ఏ మాత్రము నిలుపుకొనలేకున్నాను.
Sloka 25-ఓ దేవదేవా! ప్రపంచశరణ్యా! దయచే నా యెడ ప్రసన్నుడవగుము. నీ మండుచున్న మృత్యువును బోలిన ముఖములను మరియు భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వవిధముల నేను భ్రాంతుడనైతిని.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 15 to 20

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 15 to 20
Sloka 15-అర్జునుడు పలికెను : హే కృష్ణా! సమస్తదేవతలు, ఇతర సమస్తజీవులు నీ దేహమునందు సమావిష్టులై యుండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్యసర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను.
Sloka 16-హే విశ్వప్రభూ! విశ్వరూపా! నీ దేహమునందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆదిమధ్యాంతములను నేను గాంచలేకున్నాను.
Sloka 17-జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వదిక్కుల యందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీతములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్జ్వల రూపమును సర్వత్ర నేను గాంచుచున్నాను.
Sloka 18-దివ్యమైన ఆదిధ్యేయము నీవే. విశ్వమంతటికిని పరమాధారము నీవే. అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే. నీవే శాశ్వతధర్మమును రక్షించు దేవదేవుడవు. ఇదియే నా అభిప్రాయము.
Sloka 19-నీవు ఆదిమధ్యాంత రహితుడవై యున్నావు. నీ వైభవము అపరిమితమై యున్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగియున్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను గాంచుచున్నాను.
Sloka 20-నీవు ఒక్కడవేయైనను సమస్త ఆకాశమును, స్వర్గలోకములను మరియు వాని నడుమగల ప్రదేశమునంతటిని వ్యాపించియున్నావు. ఓ మహానుభావా! అద్భుతమును, భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నియును కలతనొందుచున్నది.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 8 to 14
Sloka 8-కాని ప్రస్తుత నేత్రములందే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్యనేత్రములను ఒసగుచున్నాను. నా యోగవైభావమును వీక్షింపుము!
Sloka 9-సంజయుడు పలికెను :ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు ఆ విధముగా పలికిన తదుపరి తన విశ్వరూపమును అర్జునునకు చూపెను.
Sloka 10-11 -అర్జునుడు ఆ విశ్వరూపమున అనతసంఖ్యలో ముఖములను, నేత్రములను,అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకృతమై, ఎత్తబడియున్న పలు దివ్యాయుధములను కలిగియుండెను. అతడు దివ్య పూమాలలను మరియు వస్త్రములను దాల్చియుండెను. పలు దివ్యసుగంధములు అతని దేహమునకు అలదబడియుండెను. అంతయు ఆశ్చర్యమయముగను, ప్రకాశమానముగను, అనంతముగను, సర్వవ్యాపకముగను ఉండెను.
Sloka 12-లక్షలాది సూర్యులు ఒక్కమారు ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమపురుషుని తేజస్సును పోలగలదు.
Sloka 13-ఆ సమయమున అర్జునుడు బహువేలసంఖ్యలో విభజింపబడియున్నను ఒకేచోట నిలిచియున్న విశ్వము యొక్క అనంతరూపములను శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమున గాంచెను.
Sloka 14-అంతట సంభ్రమమునకు గురుయైనవాడును, ఆశ్చర్యచకితుడైనవాడును, రోమాంచితుడైనవాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు అంజలిబద్ధుడై దేవదేవుని ప్రార్థింపదొడగెను.
To be continued...

Sri Bhagavad Gita telugu lo..Chapter 11 Sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo..
Chapter 11 Sloka 1 to 7
Sloka 1-అర్జునుడు పలికెను: ఈ పరమరహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది.
Sloka 2-ఓ కమలపత్రాక్షా! సర్వజీవుల జననమరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసితిని మరియు అవ్యయములైన నీ మహాత్య్మములను కూడ గుర్తించితిని.
Sloka 3-ఓ పురుషోత్తమా! ఓ పరమేశ్వారా! నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థరూపమును నేను నా యెదుట చూడగలిగినను, నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచ నభిలషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించగోరుదును.
Sloka 4-హే ప్రభూ! యోగేశ్వరా! నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము.
Sloka 5-దేవదేవడైన శ్రీకృష్ణుడు పలికెను: ఓ అర్జునా! పృథాకుమారా! లక్షలాదిగాగల నానావిధములును, దివ్యములును, పలువర్ణమయలును అగు రూపములను (నా విభూతులను) ఇప్పుడు గాంచుము.
Sloka 6-ఓ భరతవంశశ్రేష్టుడా చూడుము అదితి కుమారులైన పండ్రెండుగురు ఆదిత్యులను;  ఎనమండుగురు ,వాసుస్( Snakes) పదునొకండు రుద్రులను;  ఇరువురు అశ్వినీకుమారులను; నలుబదితొమ్మిదిమంది మరుత్తులను (వాయుదేవతలను); అట్లే;  అదృష్టపూర్వాణి నీవు గతమునందు గాంచనటువంటి;   అన్ని అద్భుతములను చూడుము.
Sloka 7-ఓ అర్జునా! నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్ష్మింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర, జంగమాది సర్వము ఏకస్థానమున దీని యందే సంపూర్ణముగా కలవు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 10 sloka 36 to 42

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 10 sloka 36 to 42
Sloka 36-నేను మోసములలో జూదమును, జేజస్వులలో తేజస్సునై యున్నాను. ఆలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే.
Sloka 37-నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి యున్నాను.
Sloka 38-నేను చట్టవిరుద్ధతను అణుచువానిలో శిక్షను, జయమును కోరువారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును అయియున్నాను.
Sloka 39-ఇంకను ఓ అర్జునా! సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావరజంగములలో నేను లేకుండ ఏదియును స్థితిని కలిగియుండలేదు.
Sloka 40-ఓ శత్రుంజయుడా! నా దివ్య విభూతులకు అంతమనునది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే.
Slokz 41-సంపన్నములును, సుందరములును, వైభవోపేతములును అగు సమస్తసృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినదిగా తెలిసికొనుము.
Sloka 42-కాని ఓ అర్జునా! ఈ సవిస్తరమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించు చుందును.
To be continued with chapter 11

Sri Bhagavad Gita telugu lo...Chapter 10 sloka 29 to 35

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 10 sloka 29 to 35
Sloka 29-నేను పెక్కుపడగలు గల నాగులలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో అర్యముడను, ధర్మనిర్వాహకులలో మృత్యుదేవతయైన యముడను అయి యున్నాను.
Sloka 30-నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడను, అణుచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షలలో గరుత్మంతుడను అయి యున్నాను.
Sloka 31-నేను పవిత్రమొనర్చువానిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, జలజంతువులలో మకరమును, నదులలో గంగానదిని అయి యున్నాను.
Sloka 32-ఓ అర్జునా! సమస్తసృష్టికి ఆది, అంతము, మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మికశాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును అయియున్నాను.
Sloka 33-నేను అక్షరములలో ఆకారమును, సమాసములలో ద్వంద్వసమాసమును, శాశ్వతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి యున్నాను.
Sloka 34-సమస్తమును మ్రింగివేయునటువంటి మృత్యువును మరియు సృష్టింపబడుచున్న జీవులకు ఉద్భవమును నేనే అయి యున్నాను. స్త్రీల యందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే.
Sloka 35-నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును అయి యున్నాను.
To be continued....

Sri Bhagavad Gita telugu lo...Chapter 10 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 10 sloka 22 to 28
Sloka 22-నేను వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతియైన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి ప్రాణమును(చైతన్యమును) అయి యున్నాను. 
Sloka 23-నేను రుద్రులలో శివుడను, యక్ష, రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి యున్నాను.
Sloka 24-ఓ అర్జునా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో సముద్రమునై యున్నాను. 
Sloka 25-నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైనవానిలో హిమాలయమును అయి యున్నాను. 
Sloka 26-నేను వృక్షములలో రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడను అయి యున్నాను.
Sloka 27-అశ్వములలో అమృతము కొరకై సాగరమంథనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజును అయి యున్నాను.
Sloka 28-నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మథుడను మరియు సర్పములలో వాసుకుని అయి యున్నాను.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 10 Sloka 15 to 21

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 10 Sloka 15 to 21
Sloka 15-ఓ పురుషోత్తమా! సర్వకారణుడా! సర్వేశ్వరుడా! దేవదేవా! జగన్నాథా! నీవొక్కడవే నీ అంతరంగశక్తి ద్వారా నిజాముగా నిన్నెరుగుదువు.
Sloka 16-నీవు ఏ దివ్యవిభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపిచియుందువో వాటన్నింనిటిని దయతో నాకు విశదముగా తెలియజేయుమ.
Sloka 17-ఓ కృష్ణా! యోగీశ్వరా! నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలిసికొనగలను? ఓ దేవదేవా! ఏ యే రూపములందు నున్ను స్మరింపవలెను?
Sloka 18-ఓ జనార్ధనా! నీ యోగవిభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివితీరుట లేదు.
Sloka 19-శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను : సరియే! నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసెదను. కాని ఓ అర్జునా! నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైనవానినే నేను నీకు తెలుపుదును.
Sloka 20-ఓ అర్జునా! నేను సర్వజీవహృదయములందు వసించియున్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదిమధ్యాంతములు నేనే అయి యున్నాను.
Sloka 21-నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై యున్నాను.
To be continued..

Sri Bhagavad Gita telugu lo...Chapter 10 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 10 sloka 8 to 14
Sloka 8-నేనే సర్వములైన ఆధ్యాత్మిక, భౌతికజగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపుర్వకముగా అర్చింతురు.
Sloka 9-నా శుద్ధభక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై, వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై యుండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవింతురు.
Sloka 10-ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైనవారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనొసగుదును. 
Sloka 11-నేను వారి యెడ ప్రత్యేకకరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు, తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింపజేయుదును.
Sloka 12-13- అర్జునుడు ఇట్లు పలికెను: నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్త్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేనివాడవు, ఘనమైనవాడవు అయియున్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహాఋషులందరును నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధ్రువపరచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమున నాకు తెలియజేయుచున్నావు.
Sloka 14-ఓ కృష్ణా! నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను ఆంగీకరించుచున్నాను. ఓ దేవదేవా! దేవతలుగాని, దానవులుగాని నీ స్వరూపమును ఎరుగజాలరు.
To be continued..

Sri Bhagavad Gita telugu lo...Chapter 10 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 10 sloka 1 to 7
Sloka 1-శ్రీకృష్ణభగవానుడు పలికెను: మహాబాహువులుగల ఓ అర్జునా! మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను.
Sloka 2-సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై యున్నందున దేవతా సమూహముగాని, మహర్షులుగాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలిసికొనజాలరు.
Sloka 3-నన్ను పుట్టుకలేనివానిగను, అనాదిగను, సర్వలోకములకు దివ్యప్రభువుగను తెలిసికొనినవాడు మాత్రమే మనుజులందరిలోను భ్రాంతిరహితుడై, సర్వపాపముల నుండి ముక్తుడగును.
Sloka 4-5- బుద్ధి,జ్ఞానము, సంశయముగాని భ్రాంతిగాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధగుణములు నా చేతనే సృష్టించబడినవి.
Sloka 6-సప్తమహాఋషులు, వారికి పూర్వము సనకసనందనాదులు మరియు మనువురు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధలోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి.
Sloka 7-నా ఈ దివ్యవిభూతిని, యోగశక్తిని యథార్థముగ నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. 
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 9 sloka 29 to 34

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 9 sloka 29 to 34
Sloka 29-నేనెవరిని ద్వేషింపను, ఎవరి యెడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల యెడ సమముగా వర్తింతురు. కాని భక్తితో నాకు సేవనొసగెడివాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేనును అతనికి మిత్రుడనై యుందును.
Sloka 30-మిక్కిలి హేయమైన కార్యము నినరించినప్పటికిని మనుజుడు భక్తియుతసేవలో నియుక్తుడైయున్నచో, తన సంకల్పమున స్థిరనిశ్చయుడై యున్నందున అతనిని సాధువుగనే పరిగణింపవలెను.
Sloka 31-అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయా! నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము.
Sloka 32-ఓ పార్థా! నా శరణుజొచ్చువారు అధమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికిని పరమగతిని పొందగలరు.
Sloka 33-ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా! అందుచే అనిత్యమును, అసుఖమును అగు ఈ లోకమునకు వచ్చియున్నందున నా ప్రేమయుక్తసేవలో నియుక్తుడవగుము.
Sloka 34-నీ మనస్సు సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము. నాకు నమస్కారము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 9 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 9 sloka 22 to 28
Sloka 22-నా దివ్యరూపమును ధ్యానించుచు అనన్యభక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షేమములను నేనే వహింతును (వారికి లేనివి సమకూర్చి, ఉన్నవి సంరక్షింతును).
Sloka 23-ఓ కౌంతేయా! అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు.
Sloka 24-నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయియున్నాను. కావున నా వాస్తవమైన దివ్యస్వభావమును గుర్తింపలేనివారు పతనము చెందుదురు.
Sloka 25-దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత, ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు.
Sloka 26-పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను, భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును.
Sloka 27-ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.
Sloka 28-ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్న్యాసయోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 9 sloka 15 to 21

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 9 sloka 15 to 21
Sloka 15-జ్ఞానసముపార్జన యజ్ఞము నందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునిగా, వివధరుపునిగా, విశ్వరూపునిగా పూజింతురు.
Sloka 16-నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్రమును అయి యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే.
Sloka 17-నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయియున్నాను. జ్ఞానలక్ష్యమును, పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము,యజుర్వేదములు కూడా నేనే.
Sloka 18-గమ్యమును, భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, విధానమును, అవ్యయ బీజమును అయి యున్నాను.
Sloka 19-ఓ అర్జునా! వేడినొసగువాడను, వర్షము నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్, అసత్తులు రెండును నా యందే యున్నవి.
Sloka 20-స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగముల ననుభవింతురు.
Sloka 21-విస్తృతమైన స్వర్గలోకభోగముల ననుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగివత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసరణము ద్వారా ఇంద్రియభోగమును వాంచించువారు కేవలము జననమరణములనే మరల, మరల పొందుదురు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 9 Sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 9 Sloka 8 to 14
Sloka 8-సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టింపబడుచు, నా సంకల్పము చేతనే అంత్యమున లయము నొందుచుండును.
Sloka 9-ఓ ధనంజయా! ఈ కర్మయంతయు నన్ను బంధింపదు. నేను తతస్థునివలె ఉండి ఈ భౌతికకర్మలన్నింటి యెడ సదా ఆసక్తిలేనివాడనై యుందును.
Sloka 10-ఓ కౌంతేయా! నా శక్తులలో ఒకటైన భౌతికప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావరజంగమములను సృష్టించుచున్నది. దాని నియమము ననుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది.
Sloka 11-నేను మానవరూపమున అవతరించినపుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమప్రభువైన నా దివ్యత్వమును వారెరుగరు.
Sloka 12-ఆ విధముగా మోహపరవశులైనవారు దానవ, నాస్తికభావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతస్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞానసముపార్జన లన్నియును వ్యర్థములగును.
Sloka 13-ఓ పృథాకుమారా! భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీప్రకృతిని ఆశ్రయించియుందురు. వారు నన్ను ఆదియును, అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు.
Sloka 14-ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు, నాకు నమస్కారమొసగుచు, నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 9 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 9 sloka 1 to 7
Sloka 1 -శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవు నా యెడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమజ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసెదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతికస్థితి వలన కలిగెడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు.
Sloka 2-ఈ జ్ఞానము విద్యలకెల్ల రాజు వంటిది మరియు సర్వరహస్యములలో పరమరహస్యమైనది. పరమపవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షజ్ఞానము కలుగజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై యున్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది.
Sloka 3-ఓ శత్రుంజయుడా! ఈ భక్తియుతసేవ యందు శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతికజగమునందలి జనన, మరణమార్గమునకే తిరిగివత్తురు.
Sloka 4-సమస్తజగత్తు అవ్యక్తరూపమున నాచే ఆవరించబడియున్నది. జీవులన్నియు నా యందున్నవి, కాని నేను వాని యందు లేను.
Sloka 5-అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగియుండదు. అచింత్యమైన నా యోగవైభమును గాంచుము! నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను, సర్వసృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమానజగత్తు నందలి భాగమును కాను. 
Sloka 6-సర్వత్రా వీచునట్టి ప్రచండవాయువు సదా ఆకాశము నందే స్థితిని కలిగియుండునట్లు, సృజింపబడిన సమస్తజీవులు నా యందు స్థితిని కలిగియున్నవని గ్రహింపుము. 
Sloka 7-ఓ కొన్తేయ! కల్పాంతమున సమస్త భౌతికసృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 8 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 8 sloka 22 to 28
Sloka 22- సర్వులకన్నను అధికుడైన దేవదేవుడు అనన్యభక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపియై యున్నాడు మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగియున్నది.
Sloka 23-ఓ భరతవంశశ్రేష్టుడా! ఏయే కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగనునో లేక తిరిగిరాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను.
Sloka 24-పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మవిదులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతి యందు, పగటియందలి ఏదేని శుభఘడియ యందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు.
Sloka 25-ధూమమునందు, రాత్రియందు, కృష్ణపక్షమునందు, సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగివచ్చును.
Sloka 26-ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయము ననుసరించి శుక్ల, కృష్ణములనెడి రెండు మార్గములు కలవు. శుక్లమార్గమునందు మరణించువాడు తిరిగిరాకుండును. కాని చీకటిమార్గమున మరణించువాడు మాత్రము వెనుకకు తిరిగివచ్చును.
Sloka 27-ఓ అర్జునా! భక్తులు ఈ రెండు మార్గములు నెరిగినప్పటికిని ఎన్నడును మోహము నొందరు. కనుక నీవు భక్తియందు సదా స్థిరుడవగుము.
Sloka 28-వేదాధ్యయనము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్వికకర్మలను మరియు కామ్యకర్మలను ఒనరించుట వలన కలుగు ఫలితములు భక్తిమార్గము చేపట్టి మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుతసేవ నొనరించుట ద్వారా అతడు వీటినన్నింటిని పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 8 sloka 15 to 21

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 8 sloka 15 to 21
Sloka 15-భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసినవారగుటచే దు:ఖాలయమైన ఈ అనిత్యజగమునకు ఎన్నడును తిరిగిరారు.
Sloka 16-భౌతికజగమునందలి అత్యున్నతలోకము మొదలుకొని అధమలోకము వరకుగల సర్వలోకములు జన్మమృత్యుభరితమైన దుఃఖప్రదేశములలే. కాని ఓ కౌంతేయా! నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు.
Sloka 17-మానవపరిగణనము ననుసరించి వేయియుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణము కలిగియుండును.
Sloka 18-బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరు అవ్యక్తస్థితి నుండి వ్యక్తము చెంది, పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు.
Sloka 19-బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనపుడు జీవులు మరల మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశులై నశింతురు.
Sloka 20-వ్యక్తావ్యక్తములయ్యెడి ఈ భౌతికప్రకృతి కన్నను పరమైనదియు, శాశ్వతమైనదియు నగు అవ్యక్తప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్టమును, నాశరహితమును అయియున్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అదిమాత్రము యథాతథముగా నిలిచియుండును.
Sloka 21-వేదాంతులు దేనిని అవ్యక్తము, అక్షరమని వర్ణింతురో, ఏది పరమగమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగిరాడో అదియే నా దివ్యధామము.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 8 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 8 sloka 8 to 14
Sloka 8-ఓ పార్థా! మనస్సును ఎల్లవేళలా నా స్మరణమునందే నియుక్తముజేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసెడివాడు నన్ను తప్పక చేరగలడు.
Sloka 9-నియమించువాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైనవాడను, సమస్తమును పోషించువాడును, భౌతికభావనలకు పరమైనవాడును, అచింత్యుడును, రూపసహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగను మరియు ప్రాచీనునిగను ప్రతియొక్కరు ధ్యానము చేయవలెను. సూర్యుని వలె తేజోసంపన్నుడును మరియు దివ్యుడును అగు అతడు భౌతికప్రకృతికి అతీతుడు.
Sloka 10-మరణసమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి, యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తిభావమున భగవానుని స్మరించెడివాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు.
Sloka 11-వేదవిదులైనవారును, ఓంకారమును ఉచ్చరించువారును, సన్న్యాసాశ్రమము నందున్న మహర్షులు అగు మనుజులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరినవారు బ్రహ్మచర్యవ్రతము నభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానము ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును.
Sloka 12-ఇంద్రియకర్మల నుండు విడివడియుండుటయే యోగస్థితి యనబడును. సర్వేంద్రియద్వారములను మూసివేసి, మనస్సును హృదయమునందు స్థిరము చేసి, ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు.
Sloka 13-ఈ యోగవిధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మికలోకములను పొందగలడు.
Sloka 14-ఓ పార్థా! అనన్యచిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుతసేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై యున్నాను.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 8 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 8 sloka 1 to 7
Sloka 1-అర్జునుడు ప్రశ్నించెను: ఓ దేవదేవా! పురుషోత్తమా! బ్రహ్మమననేమి? ఆత్మయననేమి? కామ్యకర్మలననేవి? భౌతికసృష్టి యననేమి? దేవతలన నెవరు? దయతో ఇది నాకు వివరింపుము.
Sloka 2-ఓ మధుసుదనా! యజ్ఞప్రభువెవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తియోగమునందు నిలిచినవారు మరణసమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు?
Sloka 3-శ్రీకృష్ణభగవానుడు పలికెను : నాశరహితమును, దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్యస్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము (కామ్యకర్మలు) అనబడును.
Sloka 4-ఓ దేహధారులలో శ్రేష్టుడా ! నిరంతరము పరిణామశీలమైన భౌతికప్రకృతి అధిభూతమనబడును(భౌతికజగత్తు). సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండెడి విశ్వరూపమే అధిదైవతమనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచియుండెడి దేవదేవుడైన నేనే అధియజ్ఞడును (యజ్ఞప్రభువును- lord of sacrifice). 
Sloka 5- అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.
Sloka 6-ఓ కౌంతేయా! దేహమును త్యజించునపుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును.
Sloka 7-కావున ఓ అర్జునా! సర్వకాలముల యందును నీవు నన్నే(శ్రీకృష్ణుని) తలచుచు నీ విధ్యుక్తధర్మమైన యుద్ధము నొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. 
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 26 to 30.

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 26 to 30.
Sloka 26-ఓ అర్జునా! దేవదేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగనున్న వానినన్నింటిని ఎరుగుదును. అలాగుననే జీవులందరిని నేను ఎరుగును కాని నన్నెవ్వరును ఎరుగరు.
Sloka 27-ఓ భరతవంశీయుడా! పరంతపా! కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులైన జీవులందరును మోహమునందే జన్మించుచున్నారు.
Sloka 28-పూర్వజన్మములందు, ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగ నశింపజేసికొనిన మనుజులు ద్వంద్వమోహముల నుండి విడివడినవారై నా సేవ యందు దృఢవ్రతముతో నెలకొనెదరు.
Sloka 29-ముసలితనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. దివ్యకర్మలను గూర్చి సమగ్రముగా నెరిగియుండుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై యున్నారు.
Sloka 30-నా యందు సంలగ్నమైన చిత్తము కలిగినవారు దేవదేవుడనైన నన్నే భౌతికజగత్తును, సర్వదేవతలను, సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలిసికొని మరణసమయమందును నన్ను (దేవదేవుడు) అవగాహనతో ఎరిగియుందురు. PURPORT:- కృష్ణభక్తిరసభావన యందు వర్తించు జనులు దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణముగా అవగాహనము చేసికొను మార్గము నుండి ఎన్నడును వైదొలగురు. శ్రీకృష్ణభగవానుడు ఈ విధముగా జగత్తును మరియు దేవతలను కూడా నడుపువాడై యున్నాడో కృష్ణభక్తిరసభావాన యొక్క దివ్యసాంగత్యము ద్వారా మనుజుడు తెలిసికొనగలడు. కృష్ణభక్తిభావనతో గల దివ్యసాహచర్యము ద్వారా క్రమముగా అతడు దేవదేవుని యందు విశ్వాసమును పొందును. అటువంటి కృష్ణభక్తిరసభావితుడు మరణసమయమున కూడా మరువబోడు. ఆ విధముగా సహజముగనే అతడు కృష్ణలోకమగు గోలోకబృందావనమును చేరగలడు. ఏ విధముగా మనుజుడు సంపూర్ణ కృష్ణభక్తిపరాయణుడు కాగలడో ఈ సప్తమాధ్యాయము ప్రత్యేకముగా వివరించినది. 
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 25

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 25
Sloka 25 మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడును వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగశక్తిచే కప్పబడియుందును. తత్కారణముగా వారు నేను  అజయ్యుడు ననియు, నాశములేనివాడననియు ఎరుగరు.
PURPORT:-
శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులకు దర్శనమొసగెను గావున ఇప్పుడు మాత్రము ఎందులకు సర్వులకు దర్శితమగుటలేదని ఎవరైనను వాదింపవచ్చును. కాని వాస్తవమునకు ఆ సమయమున కూడా శ్రీకృష్ణుడు సర్వులకు వ్యక్తము కాలేదు. భూమిపై అవతరించియున్నప్పుడు కొద్దిమంది మాత్రమే అతనిని దేవదేవునిగా తెలిసికొనగలిగిరి. కురుసభలో శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరముగా పలికినప్పుడు, భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతనిని దేవదేవునిగా తీర్మానించెను. అలాగుననే పాండవులు మరియు ఇతర కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవదేవుడని తెలిసికొనగలిగిరి. అతడెన్నడును అభక్తులకు మరియు సామాన్యజనులకు విదితము కాలేదు. కనుకనే భక్తులు తప్ప మిగిలిన వారందరు తనను తమవంటివాడనే తలంతురని శ్రీకృష్ణుడు గీత యందు పలికియుండెను. భక్తులకు ఆనందనిధిగా గోచరించు అతడు అజ్ఞానులైన ఆభక్తులకు తన అంతరంగశక్తిచే కప్పుబడియుండును. శ్రీకృష్ణభగవానుడు “యోగమాయ” అను తెరచే కప్పబడియున్నందున సామాన్యజనులు అతనిని తెలిసికొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలలో తెలియజేసెను. (శ్రీమద్భాగవతము 1.8.19). సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణభగవానుడు బ్రహ్మజ్యోతిచే కప్పబడియుండుట వలన బుద్ధిహీనులైన నిరాకారవాదులు అతనిని గాంచలేకున్నారు. To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 23 to 24

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 23 to 24
Sloka 23-అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు. కాని వారొసగెడి ఫలములు అల్పములు, తాత్కాలికములై యున్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు.
Sloka 24-నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడైన నేను(శ్రీకృష్ణుడు) తొలుత నిరాకారుడనై యుండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని తలతురు. అల్పజ్ఞత వలన వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్యభావమును ఎరుగలేరు.
PURPORT:-
దేవతలను పూజించువారు అల్పజ్ఞులు లేదా బుద్ధిహీనులని పైన వర్ణింపబడినారు. నిరాకారవాదులు సైతము అదేవిధముగా ఇచ్చట వర్ణింపబడిరి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన స్వీయరూపమున అర్జునుని ఎదుట సంభాషించుచున్నను నిరాకారవాదులు తమ అజ్ఞానకారణముగా భగవానుడు రూపరహితుడనియు వాదింతురు. శ్రీరామానుజాచార్యుల పరంపరలో నున్న పరమభక్తుడైన శ్రీయమునాచార్యులు ఈ విషయమున ఒక చక్కని శ్లోకమును ఇట్లు రచించియుండిరి. “హే ప్రభూ! వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నీవు దేవదేవుడవని ఎరిగియున్నారు. వేదవాజ్మయమును అవగాహన చేసికొనుట ద్వారా నీ గుణములను, రూపమును, కర్మలను తెలిసికొని మనుజుడు నిన్ను దేవదేవుడని అవగతము చేసికొనగలడు. కాని రజస్తమోగుణములందున్న దానవులు మరియు అభక్తులు మాత్రము నిన్నెన్నడును ఎరుగజాలరు. వారు నిన్ను అవగాహన చేసికొనజాలకున్నారు. అభక్తులైనవారు వేదాంతమును, ఉపనిషత్తులను, ఇతర వేదవాజ్మయమును నిపుణతతో చర్చించినను ఆదిదేవుడవైన నిన్ను అవగాహన చేసికొనుట వారికి సాధ్యము కాదు.” (స్తోత్రరత్నము 12) కేవలము వేదవాజ్మయమును అధ్యయనము చేయుట ద్వారా శ్రీకృష్ణభగవానుడు తెలియబడడని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. శ్రీకృష్ణుని గూర్చి తెలియుట కేవలము అతని కరుణతోనే సాధ్యము కాగలదు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 20 to 22

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 20 to 22
Sloka 20-విషయకోరికలచే జ్ఞానము అపహరింపబడినవారు ఇతర దేవతలకు శరణమునొంది తమ గుణములను బట్టి ఆయా పూజావిధానములను అనుసరింతురు.
Sloka 21-నేను ప్రతివారు హృదయమునందు పరమాత్మరూపున నిలిచియుందును. ఎవరేని ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును.
Sloka 22-అట్టి శ్రద్ధను పొందినవాడై మనుజుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. కాని వాస్తవమునకు ఆ వరములన్నియును నా చేతనే ఒసగబడుచున్నవి.
PURPORT:-
శ్రీకృష్ణభగవానుని అనుజ్ఞ లేనిదే దేవతలు తమ భక్తులకు ఎట్టి వరములను ఒసగలేరు. సర్వము శ్రీకృష్ణభగవానునికి చెందినదే యున్న విషయమును జీవులు మరచినను దేవతలు మాత్రము మరువరు. అనగా దేవతార్చనము మరియు తద్ద్వారా ఇష్టసిద్ధి యనునవి దేవతల వలన గాక ఆ భగవానుని ఏర్పాటు వలననే జరుగుచుండును. అల్పజ్ఞుడైన జీవుడు ఈ విషయము నెరుగలేడు. కనుకనే మూర్ఖముగా అతడు కొద్దిపాటి లాభమునకై దేవతల నాశ్రయించును. కాని శుద్ధభక్తుడు మాత్రము ఏదేని కావలసివచ్చినప్పుడు ఆ భగవానునే ప్రార్థించును. అయినను ఆ విధముగా భౌతికలాభమును అర్థించుట శుద్ధభక్తుని లక్షణము కాదు. సాధారణముగా జీవుడు తన కామమును పూర్ణము చేసికొనుట యందు ఆతురతను కలిగియుండును కనుక దేవతల నాశ్రయించును. జీవుడు తనకు తగనటువంటిదానిని కోరగా భగవానుడు అట్టి కోరికను తీర్చనప్పుడు ఆ విధముగా జరుగుచుండును.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 15 to 19

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 15 to 19
Sloka 15-దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడినవారు, దానవప్రవృత్తియైన నాస్తికస్వభావమును కలిగియుండువారు నా శరణము నొందరు.
Sloka 16-ఓ భరతవంశశ్రేష్టుడా! ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్త్వజ్ఞానము నన్వేషించువాడు అనెడి నాలుగురకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్తసేవ నొనరింతురు.
Sloka 17-వీరిలో సంపూర్ణజ్ఞానము కలిగి సదా భక్తియుక్తసేవలో నియుక్తుడై యుండెడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయన నేనతనికి మిక్కిలి ప్రియుడను మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు.
Sloka 18-ఈ భక్తులందరును నిస్సంశయముగా ఉదాత్తులే యైనను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైనవానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమ మరియు పరమగతియైన నన్ను తప్పక పొందగలడు.
Sloka 19-జ్ఞానవంతుడైనవాడు బహు జన్మమృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలిసికొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు.
PURPORT:-
భక్తియుతసేవ నొనరించుచు జీవుడు పలుజన్మల పిదప శ్రీకృష్ణభగవానుడే ఆధ్యాత్మికానుభవపు చరమలక్ష్యమును దివ్యమగు శుద్ధజ్ఞానమునందు వాస్తవముగా స్థితుడు కాగలడు. ఆధ్యాత్మికానుకానుభవపు ఆది యందు మనుజుడు భౌతికత్వసంపర్కమును తొలగించుకొను యత్నము చేయునపుడు కొంత నిరాకారభావము వైపునకు మ్రొగ్గుచూపుట జరుగును. కాని అతడు తన యత్నములో పురోభివృద్ధి నొందినప్పుడు ఆధ్యాత్మిక జీవనమున పెక్కు కర్మలు గలవనియు, అవియే భక్తియుత సేవాకార్యములనియు అవగతము చేసికొనును. ఆ విధముగా అతడు తెలిసికొని శ్రీకృష్ణభగవానుని యెడ ఆకర్షితుడై అతనిని శరణుజొచ్చును. 
To be continued..

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 8 to 14
Sloka 8-ఓ కుంతీపుత్రా! నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశము నందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి యున్నాను.
Sloka 9-భూమి యొక్క ఆద్యమైన సుగంధము, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్వుల యందు తపస్సును నేనైయున్నాను.
Sloka 10-ఓ పృథాకుమారా! నేనే సర్వప్రాణులకు సనాతనబీజముననియు, బుద్ధిమంతుల బుద్ధిననియు, శక్తిమంతుల శక్తిననియు తెలిసికొనుము.
Sloka 11-ఓ భరతవంశశ్రేష్టుడా! బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మనియమములకు విరుద్ధము కానటువంటి సంభోగమును నేనే అయియున్నాను.
Sloka 12-సత్త్వగుణమునకు గాని, రజోగుణమునకు గాని లేదా తమోగుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నియును నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలిసికొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై యున్నాను. ప్రకృతిత్రిగుణములు నా యందున్నను నేను వాటికి లోబడియుండును.
Sloka 13-సమస్తవిశ్వము సత్త్వరజస్తమోగుణములనెడి త్రిగుణములచే భ్రాంతికి గురియై గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను ఎరుగజాలకున్నది.
Sloka 14-త్రిగుణాత్మకమైన నా ఈ దైవీమాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కాని నన్ను శరణుజొచ్చినవారు దీనిని సులభముగా దాటగలుగులుగుదురు.
To be continued...