Sunday, 24 May 2020

Sri Bhagavad Gita Telugu lo...Chapter 18 sloka 77 to 78

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita Telugu lo...
Chapter 18 sloka 77 to 78
Sloka 77-మరియు, శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడినై, పదేపదే మహదానందముతో పులకించి పోతున్నాను.
Sloka 78- ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల-సమృద్ధి మరియు ధర్మమూ ఉంటాయి - అని నా నిశ్చిత అభిప్రాయము.
Chapter 18 completed.
జై శ్రీ కృష్ణ ....  జై శ్రీ రామ్ 

హరి ఓం తత్ సత్ 
హరి హీ ఓం 
ఓం తత్ సత్ 

దేవుడు నారాయణుడు ఒకడే , మరిఒక్క దేవుడు లేరూ  లేరూ.... యజుర్వేద 

విష్ణు ఒక్కడే పూజకు హరు హుడు - రిగ్వేద 
 
ఇక శెలవు ......... హరి హారయా నమః 
ఓం నమః నారాయణాయ 
ఓం నమః శివ్యయా 
శ్రీ రామ చంద్ర నారాయణ ....

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 70 to 76

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 70 to 76
Sloka 70-మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే (తమ బుద్ధిచే) నన్ను ఆరాధించినట్టు; అని నా అభిప్రాయము.
Sloka 71-శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.
Sloka 72-ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రత తో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా?
Sloka 73-అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా (దోషరహితుడా), నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
Sloka 74-సంజయుడు పలికెను: ఈ విధంగా, నేను, వాసుదేవుని పుత్రుడు శ్రీ కృష్ణుడికి మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనది అంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
Sloka 75-వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.
Sloka 76-సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదేపదే గుర్తుచేసుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 63 to 69

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 63 to 69
Sloka 63-ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాలకన్నా పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేసాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము.
Sloka 64-నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము, అది సమస్త జ్ఞానములో కెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి.
Sloka 65-ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి.
Sloka 66-అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విముక్తి చేసెదను, భయపడకుము.
Sloka 67-ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నుడు కాని వానికి, భక్తి లేని వానికి చెప్పకూడదు. (ఆధ్యాత్మిక విషయములు) వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు, మరియు ప్రత్యేకంగా నాపట్ల అసూయ కలవారికి కూడా దీనిని చెప్పకూడదు.
Sloka 68-ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు.
Sloka 69-వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు; వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 56 to 62

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 56 to 62
Sloka 56-నా భక్తులు సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా, నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు.
Sloka 57-నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము.
Sloka 58-నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ ఒకవేళ, అహంకారముచే, నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు.
Sloka 59-ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై , "నేను యుద్ధం చేయను" అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్ధమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క స్వంత (క్షత్రియ) భౌతిక స్వభావమే నిన్ను యుద్ధము చేయటానికి పురికొల్పుతుంది.
Sloka 60-ఓ అర్జునా, మోహప్రభావముచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో, నీ యొక్క సహజసిద్ధ స్వభావముచే జనించిన ప్రేరణ చే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడుతావు.
Sloka 61-ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.
Sloka 62-సంపూర్ణ హృదయ పూర్వకముగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము, ఓ భరతా. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 49 to 55

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 49 to 55
Sloka 49-ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.
Sloka 50-ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని (కర్మ సన్న్యాసములో) పొందిన వ్యక్తి, ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా, బ్రహ్మాం ను కూడా ఎలా పొందగలడో - వివరిస్తాను, నా నుండి క్లుప్తముగా వినుము.
Sloka 51 to 53-వ్యక్తి ఎప్పుడైతే - పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, మరియు ఇంద్రియములను చక్కగా నిగ్రహించి, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్ధము - లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై, పరబ్రహం తో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. (అంటే, పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో తెలుసుకోవటం).
Sloka 54-పరబ్రహ్మాంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంతచిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందును.
Sloka 55-కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్ధముగా నేను ఎవరో (ఎంతటివాడినో) తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 43 to 48

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 43 to 48
Sloka 43-శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలోనుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్ధ్యము - ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు.
Sloka 44-వ్యవసాయం, పాడిపంటలు, మరియు వర్తకవాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి.
Sloka 45-స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ/నిర్వర్తిస్తూ పరిపూర్ణత ను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నానుండి వినుము.
Sloka 46-తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి - సమస్త భూతములూ ఎవని నుండి ఊద్భవించాయో మరియు ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో - వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు.
Sloka 47-పర (ఇతరుల) ధర్మము చేయుటకంటే, సరిగ్గా చేయలేకపోయినా సరే, తన స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.
Sloka 48-తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలు ఉన్నాసరే ఎన్నటికీ విడిచిపెట్టరాదు, ఓ కుంతీ పుత్రా. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు, సమస్త కర్మ ప్రయాసలూ, ఏదోఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.
To be continued...

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 36 to 42

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 36 to 42
Sloka 36-ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి.
Sloka 37-మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతం లాగా ఉండే సుఖమే సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది.
Sloka 38-ఇంద్రియములతో ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేత కలిగిన సుఖమును రాజసిక (రజో గుణ) సుఖము అని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది.
Sloka 39-ఏదైతే ఆనందము - ఆత్మ యొక్క అస్థిత్వమును పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, మరియు నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో - అది తామసిక (తమోగుణములో) ఆనందము అని చెప్పబడును.
Sloka 40-ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు.
Sloka 41-బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు - వీరి యొక్క విధులు వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. (పుట్టుక పరంగా కాదు).
Sloka 42-శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్చత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు.
To be continued...